Begin typing your search above and press return to search.
ఆగస్టు 20న సీఎంతో ఫిలిం ఇండస్త్రి మీటింగ్
By: Tupaki Desk | 6 Aug 2015 5:13 AM GMTతెలంగాణ సినిమా పరిశ్రమ భవిష్యత్ ఏమిటి? ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాల్ని తీసుకోబోతోంది? అన్న సంగతి ఈనెల 20తో తేలిపోనుంది. ఆ మేరకు ఇప్పటికే తెలంగాణ సినిమా పెద్దలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మంతనాలు సాగించారు. ఈనెల 20లోగా కేసీఆర్ ని కలిసి ఓ 20 డిమాండ్లతో కూడిన శ్వేతపత్రాన్ని అందజేయనున్నారు. దీనికోసం టిఎస్ ఎఫ్ సిసి అధ్యక్షుడు రామ్మోహన్ తీవ్రంగా యత్నిస్తున్నారు.
తెలంగాణ ఫిలింఛాంబర్ (టిఎస్ ఎఫ్ సిసి) అధ్యక్షుడు రామ్మోహన్ రావ్ ఇటీవలే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిశారు. 16 డిమాండ్లతో కూడిన ఓ ఎజెండాని సిద్ధం చేసి మంత్రివర్యులకు వినిపించారు. దీనికి మంత్రిగారు పాజిటివ్ గా స్పందించడమే కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసేముందు సావధానంగా ప్రతి పాయింటును వింటానని మాటిచ్చారు. రావ్ తో పాటు దిల్ రాజు, నారాయణ నారంగ్ దాస్, సుధాకర్ రెడ్డి, ఎన్.శంకర్ వంటి ప్రముఖులు ఈ మీటింగులో పాల్గొన్నారు.
డిమాండ్లలో కీలకంగా చర్చించే కొన్ని పాయింట్ల వివరాలు పరిశీలిస్తే ... ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ లో ఓ మినీ థియేటర్ ని ప్రభుత్వం భాగస్వామ్యంతో నిర్మించాలి. 200 సీట్లతో పరిమిత స్పేష్ లో థియేటర్ ని నిర్మిస్తే సరిపోతుంది. వీటిలో చిన్న సినిమాకి పెద్ద ప్రాధాన్యతనివ్వాలి. అలాగే తెలంగాణ సినిమాకి సొంతంగా ఓ బిల్డింగ్ కావాలి. దానికోసం స్థలం కావాలి. దీనికి ఎకరా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగానే ఉందని చెబుతున్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం ఇనిస్టిట్యూట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలన్నది ఓ ప్రధాన డిమాండ్.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో అస్సలు ఫిలింఫెస్టివల్స్ మాటే లేదు. అందుకే ఈసారి బాలల చలన చిత్రోత్సవాల్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపించడానికి ప్లాన్ చేయాలన్నది ఓ ప్రపోజల్. ఇక నుంచి రెగ్యులర్ గా యేటేటా ఈ ఉత్సవాలు ఘనంగానే నిర్వహించాలన్నది ప్రతిపాదన. ఈ శ్వేతపత్రాన్ని తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళ్లనున్నారు.