Begin typing your search above and press return to search.
విద్యాబాలన్ కు శ్రీదేవి అవార్డ్
By: Tupaki Desk | 14 Jan 2019 4:54 AM GMTఅవార్డులు ఇచ్చే వాళ్లకు కలిసొస్తుందా? అవార్డు కార్యక్రమాలతో సంపాదించుకోవడం కుదురుతుందా? అంటే అవార్డు వేడుకలు చేసేవాళ్లు తమ కష్టాలకడలి గురించి చెబుతుంటారు. అవార్డు కార్యక్రమాలు కేవలం జనాల ముందు సోకుల కోసమే అనేవాళ్లు ఉన్నారు. అవార్డుల పేరుతో ఓ చోటికి టాప్ సెలబ్రిటీల్ని చేర్చడం ద్వారా ఒక పెద్ద కార్యక్రమంతో జనాలకు వినోదం అందించడమే ధ్యేయమని చెబుతుంటారు. అవార్డు కార్యక్రమాలతో సంపాదించుకునేది ఏమీ ఉండదని అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.
కళాబంధు .. టీఎస్సార్ ఇదే బాపతు. అవార్డులు ఇవ్వడం వల్ల ఒక మంచి కల్చర్ ని సెలబ్రిటీ లోకంలో పంచడమే ధ్యేయమట. ఆయన టీఎస్సార్ అవార్డ్స్ పేరుతో 2010 నుంచి ఎనిమిదేళ్లుగా అవార్డులిస్తూనే ఉన్నారు. ఇవేవీ అతడికి డబ్బు తెచ్చేవి కానే కాదు. అవార్డుల పేరుతో అతడు తన పాత స్నేహితులందరినీ ఓ వేదికపైకి తెస్తుంటారు. ఈసారి కూడా తన స్నేహితుల కోసమే ఈ వేడుకలు చేస్తున్నారట. ఫిబ్రవరి 17న విశాఖపట్నం, పోర్ట్ గ్రౌండ్ లో వేలాదిమంది సమక్షంలో ఘనంగా 2017- 18 ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని జరుపుతామని టి. సుబ్బరామిరెడ్డి తెలిపారు.
ఈసారి శ్రీదేవి మెమోరియల్ అవార్డును విద్యాబాలన్ కు అందిస్తున్నామని అవార్డుల కర్టెన్ రైజర్ వేడుకలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితర తారలు హాజరవుతున్నారట. సూర్య, విక్రమ్ తో పాటు పలువురు తమిళనాడు స్టార్లకు అవార్డులిస్తున్నారు ఈ వేదికపైకి. ఇక ఈ వేదికపైకి జయప్రద, జయసుధ వంటి నాటి మేటి నాయికలు హాజరవుతారట. నగ్మా, మీనా వంటి తారలు విచ్చేస్తున్నారు. ఇకపోతే టీఎస్సార్ వేల కోట్ల సామ్రాజ్యం అటు నెల్లూరు, తిరుపతి నుంచి ఇటు వైజాగ్, హైదరాబాద్ వరకూ విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ పార్క్ హయత్ స్టార్ హోటల్ ఆయన సారథ్యంలోనే రన్ అవుతోంది. టీఎస్సార్ & టీబీకే విద్యా సంస్థలు ఫేమస్, పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. వేల కోట్ల ఆస్తులు టీఎస్సార్ కి ఉన్నాయి. సాంస్కృతిక సార్వభౌమ బిరుదాంకితుడాయన. కల్చరల్ మంత్రి గానూ పని చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అవార్డు కార్యక్రమాలతో పాత స్నేహాల్ని కలుపుతుంటారాయన. ఇదంతా ఆయనకు సెలబ్రిటీ ప్రపంచంపై ఉన్న మమకారం, పిచ్చికి ఎగ్జాంపుల్ అని సన్నిహితులు చెబుతుంటారు.
అవార్డు కార్యక్రమం వేళ.. టీఎస్సార్ బయోపిక్ పైనా ఓ ఆసక్తికర చర్చ సాగింది. బయోపిక్ ల ట్రెండ్ లోనే రాజకీయ, పారిశ్రామిక, కళా రంగాలలో తనదైన ముద్ర వేసిన టి. సుబ్బరామిరెడ్డి జీవితాన్ని బయోపిక్ గా రూపొందించాల్సిన అవశ్యకత ఉందని శోభనా కామినేని కర్టెన్‌రైజర్ వేడుకలో మాట్లాడారు. తన తండ్రికి వేరెవ్వరూ సాటిరారని, అతి త్వరలోనే ఆయన ఆటోబయోగ్రఫీని విడుదల చేయబోతున్నామని టీఎస్సార్ తనయ పింకీ రెడ్డి చెప్పారు.