Begin typing your search above and press return to search.

క‌ళాబంధు అవార్డులు..దేనికి సంకేతం?

By:  Tupaki Desk   |   15 Feb 2019 4:42 AM GMT
క‌ళాబంధు అవార్డులు..దేనికి సంకేతం?
X
ప‌రిశ్ర‌మ‌లో అంద‌రివాడిగా క‌ళాబంధు టి.సుబ్బ‌రామిరెడ్డి సుప‌రిచితం. నాటి మేటి హీరోలు - న‌టీన‌టులు స‌హా నేటి త‌రం హీరోల వ‌ర‌కూ అంద‌రికీ కావాల్సిన వాడు ఆయ‌న‌. ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ‌ - కృష్ణంరాజు - మెగాస్టార్ చిరంజీవి - న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌ - నాగార్జున‌ - వెంకటేష్ .. ఇలా అంద‌రు హీరోల‌కు స‌న్నిహితుడు. పారిశ్రామిక వేత్త‌గా.. రాజ‌కీయ నాయ‌కుడిగా.. వ్యాపార‌వేత్త‌గా.. సినీ నిర్మాత‌గా.. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా ప్ర‌పంచానికి అత‌డు సుప‌రిచితం. వీట‌న్నిటినీ మించి ఆయ‌న‌లో క‌ళాతృష్ణ సినీప‌రిశ్ర‌మ‌కు అంకిత‌మ‌య్యేలా చేసింది. గ్లామ‌ర్ అండ్ గ్లిజ్ ప్ర‌పంచంలో ఆయ‌న చేతులమీదుగా ఎన్నో స‌కార్యాలు సిద్ధించ‌డంతో క‌ళాబంధు అన్న బిరుదాంకితులయ్యారు. బిలియ‌న్ డాల‌ర్ బిజినెస్ ప్ర‌పంచంలో `నేను సైతం` అంటూ టీఎస్సార్ క‌దం తొక్కుతుంటారు. రెగ్యుల‌ర్ గా సినిమా వాళ్ల వ్యాప‌కాల్లో ఉండే ఆయ‌న కేంద్ర మంత్రిగా సాంస్కృతిక రంగానికి విశిష్ఠ సేవ‌లందించారు. అలాగే అవార్డుల కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌నది అందెవేసిన చెయ్యి! ఏఎన్నార్ పుర‌స్కారాల క‌మిటీకి అధ్య‌క్షుడు ఆయ‌న‌. అలాగే టీఎస్సార్ జాతీయ అవార్డులు అంటూ గ‌త ప‌దేళ్లుగా సేవ‌లందిస్తున్నారు. ప్ర‌ముఖ తెలుగు టీవీ చానెల్ తో క‌లిసి ఆయ‌న ఈ పుర‌స్కారాల్ని అందిస్తున్నారు.

అందుకోసం ఒక జ్యూరీ క‌మిటీ కూడా ఉంది. ఇందులో మేటి న‌టి - రాజ‌కీయ నాయ‌కురాలు న‌గ్మ జ్యూరీ మెంబ‌ర్ గా ప‌ని చేస్తుండ‌డం అద‌న‌పు గ్లామ‌ర్ ని అద్దుతోంది. నాటి మేటి సీనియ‌ర్ నాయిక‌లంతా క‌మిటీ స‌భ్యులుగా ఉన్నారు. అయితే ఈ పుర‌స్కారాల మోటో ఏదైనా కానీ, క‌ళాకారులంద‌రినీ ఒకే వేదిక‌పై చూడాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న అని చెబుతారు. అందుకు త‌గ్గ‌ట్టే ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రు స్టార్లు ఉంటే అంద‌రికీ ఏదో ఒక అవార్డును క్రియేట్ చేసి ఇస్తుంటార‌ని - త‌ద్వారా రంగుల ప్ర‌పంచాన్ని ఓ చోటికి చేర్చి క‌న్నుల పండువ‌గా సంబ‌రాలు చేస్తుంటార‌ని చెబుతుంటారు. ఏదేమైనా టీఎస్సార్ వంటి ఔత్సాహికులు ఈ ప్ర‌పంచంలో చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఉంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అవార్డుల కార్య‌క్ర‌మాలు చేయ‌డం వ‌ల్ల అణా పైసా లాభం ఒరిగేదేం ఉండ‌ద‌న్న స‌త్యం కొంద‌రికే తెలుసు కాబ‌ట్టి.. ఆయ‌న చేస్తున్న ఈ సేవ‌ల్ని ప్ర‌శంసించి తీరాలి.

ఇప్ప‌టికే నాలుగేళ్లు టీఎస్సార్ జాతీయ అవార్డులు ఇచ్చారు. ఈసారి ఐదో ఏడాది పుర‌స్కారాల్ని నిన్న‌టి సాయంత్రం హైద‌రాబాద్ లో ప్ర‌క‌టించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఎస్సార్ తో పాటు - జ్యూరీ సభ్యులు డా. శోభనా కామినేని - సినీ నటి నగ్మా - పరుచూరి గోపాల క ష్ణ - ప్రముఖ పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. కళాబంధు - రాజ్యసభ సభ్యులు - లలితకళా పరిషత్ చైర్మన్‌ టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ``10 ఏళ్ల‌ క్రితం జాతీయ స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణతో ఈ అవార్డులు ఇవ్వాల‌ని భావించాం. తెలుగు - హిందీ - తమిళ్‌ - కన్నడ - మలయాళ - భోజ్‌ పురి భాషలలో ఈ అవార్డులను ప్రకటిస్తున్నాం. 2017-18కి గానూ `మహానటి` చిత్రం 6 అవార్డులు -`రంగస్థలం` 3 అవార్డులు గెలుచుకున్నాయి. ఫిబ్రవరి 17న పోర్ట్‌ స్టేడియం (క్రికెట్‌ గ్రౌండ్‌) - విశాఖ పట్నంలో ఈ వేడుక జ‌ర‌గ‌నుంది`` అని వివ‌రాలు ప్ర‌క‌టించారు. ఆస‌క్తిక‌రంగా ఈ వేడుక ఆద్యంతం సీనియర్ న‌టి న‌గ్మ చేసిన సంద‌డి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. 2017-18 ఏడాదిలో సినిమాలు తీసిన మెజారిటీ పేర్లు పుర‌స్కారాల జాబితాలో వినిపించాయి. ముఖ్యంగా స్టార్లు ఎవ‌రినీ టీఎస్సార్‌ వ‌దిలిపెట్ట‌నే లేదు. చిరంజీవి - బాల‌కృష్ణ స‌హా నాగార్జున‌ - రామ్ చ‌ర‌ణ్‌ - అడ‌వి శేష్ ఇలా అంద‌రినీ క‌లుపుకుంటూ రెండేళ్ల‌కు పుర‌స్కార విజేత‌ల్ని ప్ర‌క‌టించారు. ఆస‌క్తిక‌రమైన విష‌యం ఏమంటే రెండేళ్ల క్రితం అవార్డుల్ని ఇప్పుడు ప్ర‌క‌టిస్తున్నారు కాబ‌ట్టి ఏదో కొత్త‌గా వింత‌గానూ అనిపించ‌కుండా ఉండ‌దు. ఖైదీనంబ‌ర్ 150 చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న వి.వి.వినాయ‌క్ అప్ప‌టికి సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్. కానీ రెండేళ్ల త‌ర్వాత స‌న్నివేశం ఏంటో తెలిసిందే. అయినా అత‌డు ఇప్పుడు వేదిక‌పై అవార్డు అందుకోబోతుండ‌డం ఆస‌క్తిక‌రం. అస‌లీ అవార్డులేంటి ఇంత ఆల‌స్యంగా !! అంటూ మాట్లాడుకోవ‌డం ఆస‌క్తిక‌రం. ఏదేమైనా అంద‌రినీ ఒకే వేదిక‌పై చూసుకోవాల‌న్న క‌ళాబంధు తృష్ణ గెలిచింది ఇక్క‌డ‌!!