Begin typing your search above and press return to search.
8న టీఎస్సార్-టీవీ9 అవార్డుల పండుగ
By: Tupaki Desk | 4 March 2017 5:55 AM GMTసాగర నగరం విశాఖలో ఈ నెల 8న సినీ కోలాహలం కనిపించనుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ - కోలీవుడ్ సహా ఇతర రాష్ట్రాల సినీ ప్రముఖులు సందడి చేయనున్నారు. సీనియర్ పొలిటీషియన్ - రాజ్యసభ సభ్యుడు - ప్రముఖ పారిశ్రామికవేత్త టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలోని టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళా పరిషత్... టీఎస్సార్-టీవీ9 అవార్డుల పంపిణీనే ఈ సందడికి వేదికగా నిలవనుంది. రాజీకీయాల్లో ఉన్నా... సినీ పరిశ్రమతో చాలా క్లోజ్ గా మెలిగే సుబ్బిరామిరెడ్డి అవార్డుల వేడుక అంటే... భారీ హంగామా ఉంటుందన్న విషయం తెలిసిందేగా. మొన్న తన మనవడి వివాహానానికి టీఎస్సార్ ఆహ్వానాలు పంపిన సినీ జనాల సంగతి చూస్తే... 8న విశాఖలో జరిగే అవార్డుల వేడుక ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం కాక మానదు.
నిన్న హైదరాబాదులోని తన సొంత హోటల్ పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎస్సార్... ఈ అవార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. అవార్డుల ఎంపిక కోసం జ్యూరీ కమిటీని ప్రకటించిన టీఎస్సార్.. సదరు కమిటీకి తానే నేతృత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇక అవార్డుల కమిటీలో ఉన్న సభ్యుల విషయానికి వస్తే.. సినీతారలు జయసుధ, జీవిత, మీనా, సోషలైట్స్ శోభన కామినేని, పింకీ రెడ్డి, దర్శకుడు బి. గోపాల్, నిర్మాత పొట్లూరి వి. ప్రసాద్, పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఇక 8న విశాకలోని క్రికెట్ స్టేడియంలో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు దేశం నలుమూలల నుంచి ప్రముఖ నటులు తరలిరానున్నారు. వీరిలో బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్ - హేమమాలిని - శతృఘ్నసిన్హా - రిషీకపూర్ - మాధురీదీక్షిత్ - విద్యాబాలన్ - సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన రజనీకాంత్ - సూర్య - విక్రం - చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఇక అవార్డుల విషయానికి వస్తే... 2015-16 ఏడాదికి సంబంధించి ఉత్తమ నటుడు - చిత్రం - హీరోయిన్ - నటి - దర్శకుడు - సంగీత దర్శకుడు - కేరక్టర్ నటుడు - కేరక్టర్ నటి - విలన్ - కమెడియన్ - గాయకుడు - గాయని - నూతన హీరో - నూతన హీరోయిన్, విభాగాల్లో ఉత్తమ అవార్డులను ఇస్తామని టీఎస్సార్ చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/