Begin typing your search above and press return to search.

టక్‌ వేసుకుని స్టైల్‌ గా థియేటర్‌ లో..!

By:  Tupaki Desk   |   23 July 2021 1:30 AM GMT
టక్‌ వేసుకుని స్టైల్‌ గా థియేటర్‌ లో..!
X
నాని హీరోగా శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన టక్‌ జగదీష్‌ సినిమా గత ఏడాది నుండి వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది సమ్మర్ లో విడుదల అనుకున్న సినిమా కాస్త వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని హడావుడి చేసినా కూడా సెకండ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. సినిమా షూటింగ్‌ ముగిసి చాలా రోజులు అయ్యి.. నిర్మాతలు ఆర్థికంగా ఇబ్బంది అనుకున్న వారు ఓటీటీకి వెళ్లి పోతున్నారు. ఇప్పటికే నారప్ప వంటి పెద్ద సినిమాలు కూడా ఓటీటీ తలుపు తట్టాయి. ఈ నేపథ్యంలో మరిన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ కు సిద్దం అవుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. అందులో టక్ జగదీష్‌ సినిమా కూడా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది.

శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన గత చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆయన సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ వెయిట్‌ చేసేంతగా ఆయన బ్రాండ్‌ ఇమేజ్ పెరిగింది. అందుకే ఈ సినిమాను థియేటర్లలో లేదా ఓటీటీ లో ఎక్కడ విడుదల చేసిన కూడా భారీగా చూస్తారనే నమ్మకం అందరిలో ఉంది. అందుకే ఈ సినిమా ను కొనుగోలు చేసేందుకు ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్ పెద్ద ఎత్తున ఆఫర్‌ ఇచ్చాయట. కాని నిర్మాతలు మాత్రం ఆ మొత్తంను తిరష్కరించడంతో పాటు తాము కేవలం థియేటర్‌ రిలీజ్‌ కు మాత్రమే వెళ్తామని క్లారిటీ ఇచ్చారు.

తాజాగా మీడియాలో వస్తున్న వార్తలను టక్‌ జగదీష్‌ నిర్మాతలు కొట్టి పారేశారు. తాము సినిమాను థియేటర్‌ లో మాత్రమే విడుదల చేస్తామంటూ ప్రకటించారు. ఓటీటీ ఆలోచన లేదు అన్నట్లుగా వారు ప్రకటించారు. దాంతో సినిమా థియేటర్లు ఎప్పటికి పూర్తి స్థాయిలో రన్‌ అవుతాయో అప్పటి నుండి ఈ సినిమా విడుదల కు రెడీ చేస్తామని వారు పేర్కొన్నారు. నాని మరియు శివ నిర్వాన ల కాంబోలో గతంలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా లో నాని లుక్ మరియు నేపథ్యం చాలా క్లాస్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉంది అంటూ పోస్టర్‌ లు టీజర్‌ చూసిన తర్వాత టాక్‌ వచ్చింది.