Begin typing your search above and press return to search.

టక్ జగదీశ్ డీల్ అంత భారీనా? ఎవరికి దక్కిందంటే?

By:  Tupaki Desk   |   8 Aug 2021 4:01 AM GMT
టక్ జగదీశ్ డీల్ అంత భారీనా? ఎవరికి దక్కిందంటే?
X
గడిచిన కొంతకాలంగా నాని నటించిన ‘టక్ జగదీశ్’ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర కథానాయకుడు నాని కోరుకుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద రిలీజ్ చేసేందుకు నిర్మాతలు మొగ్గుచూపటం తెలిసిందే. ఈ అంశంపై కిందామీదా పడుతున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ మూవీని ఓటీటీ ప్లాట్ ఫాం మీద విడుదల చేసేందుకు వీలుగా డీల్ ఓకే అయినట్లుగా పరిశ్రమ వర్గాలుచెబుతున్నాయి.

నాని నటించిన ఈ మూవీని కరోనా సెకండ్ వేవ్ కు కాస్త ముందు విడుదల చేయాలని భావించారు. కానీ.. అనూహ్య పరిణామాలతో అది కాస్తా ఆగిపోయింది. అప్పటి నుంచి క్యాలెండర్లో నెలలు మారుతున్నప్పటికీ.. దాని విడుదలకు మోక్షం కలగని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాని నేపథ్యంలో.. సినిమాను దాచి పెట్టుకోవటం కంటే కూడా.. ఓటీటీ ఫ్లాట్ ఫాంకు అప్పజెప్పేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీనిపై చిత్ర హీరో నానికి.. నిర్మాతలకు మధ్య చర్చలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ మూవీకి ప్రముఖ ఓటీటీ అమెజాన్ సంస్థ నుంచి వచ్చిన ఫ్యాన్సీ ఆఫర్ కు నిర్మాతలు ఓకే చెప్పేసినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీని ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల చేసేందుకు వీలుగా రూ.42 కోట్లకు డీల్ ఫైనల్ అయినట్లుగా చెబుతున్నారు.

టక్ జగదీశ్ డీల్ ఫైనల్ అయితే.. అదే బాటలో నడవటానికి మరిన్ని సినిమాలు ముందుకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఈ డీల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. మొత్తంగా చూస్తే.. తన సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని భావించిన హీరో నాని కోరిక నెరవేరనట్లేనన్న మాట వినిపిస్తోంది.