Begin typing your search above and press return to search.

'టక్ జగదీష్' ఉగాది స్పెషల్ ట్రీట్..!

By:  Tupaki Desk   |   13 April 2021 1:41 PM IST
టక్ జగదీష్ ఉగాది స్పెషల్ ట్రీట్..!
X
ఉగాది పండుగ అంటేనే తెలుగు సంప్రదాయాలు, రుచులను, సంస్కృతిని గుర్తు చేసేది. అలాంటి పండుగ సందర్బంగా చాలా తెలుగు సినిమాలు ఈ ఏడాది సందడి చేసేందుకు సిద్ధం అయ్యాయి. కానీ కరోనా కోరలు చాచడంతో సినిమాలు విడుదలలు ఆగిపోవడమే కాకుండా జరుపుకోవాల్సిన పండుగలు కూడా జరుపుకునే పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి ఏప్రిల్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉన్నాయి. ఉగాది పండుగ అంటే సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ మూవీస్ గుర్తొస్తాయి. అలాంటి సినిమాల్లో ఒకటిగా రాబోతుంది నేచురల్ స్టార్ నాని నటించిన 'టక్ జగదీష్'. ఫ్యామిలీ మూవీగా ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదల కావాల్సింది.

ఇటీవలే సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా హీరో, మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఉగాది సందర్బంగా టక్ జగదీష్ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఉగాది కాబట్టి సినిమా పోస్టర్ లో కూడా ఆ పండగ వాతావరణం కనిపిస్తుంది. టోటల్ సినిమాలో ఉన్నటువంటి ప్రధాన తారాగణం అంతా ఈ కొత్త పోస్టర్ ద్వారా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు టక్ జగదీష్ మేకర్స్. ఈ పోస్టర్ చూస్తే ఎంతో ఆనందంగా ఫ్యామిలీతో పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ తో పాటు విడుదలతేదీ కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. రితూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. మజిలీ ఫేమ్ సాహు, హరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టక్ జగదీష్ న్యూ పోస్టర్ వైరల్ అవుతోంది.