Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : తుంటరి
By: Tupaki Desk | 11 March 2016 11:19 AM GMTచిత్రం: తుంటరి
నటీనటులు: నారా రోహిత్ - లతా హెగ్డే - కబీర్ సింగ్ - వెన్నెల కిషోర్ - షకలక శంకర్ - కాశీ విశ్వనాథ్ - పూజిత - సుదర్శన్ తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: పళని కుమార్
మాటలు: లక్ష్మీభూపాల్ - శ్రీకాంత్ రెడ్డి
నిర్మాతలు: అశోక్ - నాగార్జున్
కథ: మురుగదాస్
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కుమార్ నాగేంద్ర
తెలుగులో హీరోలు తరచుగా కమర్షియల్ సినిమాలు చేస్తూ.. ఛేంజ్ కోసం కొంచెం వైవిధ్యమైన సినిమాలు ట్రై చేస్తుంటారు. కానీ నారా రోహిత్ దీనికి భిన్నంగా మొదట్నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. ఇప్పుడు తొలిసారి ‘తుంటరి’ లాంటి కమర్షియల్ సినిమా ట్రై చేశాడు. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ అందించిన కథతో తెరకెక్కిన తమిళ సినిమా ‘మాన్ కరాటె’కు ఇది రీమేక్. కుమార్ నాగేంద్ర దర్శకుడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
రాజు (నారా రోహిత్) వైజాగ్ లో అల్లరి చిల్లరిగా తిరిగేసే కుర్రాడు. ఐతే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయిన ఐదుగురు మిత్రుల బృందం రాజు దగ్గరికి వచ్చి బాక్సర్ అవ్వమని కోరుతుంది. నెలకు లక్ష రూపాయలు ఇస్తామని, అతను అడిగిందల్లా ఇస్తామని ఆ ఫ్రెండ్స్ చె్పడంతో రాజు మొక్కుబడిగా బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలుపెడతాడు. రాజు ప్రేమించిన సిరి కూడా అతడి బాక్సింగ్ చూసి ఇష్టపడుతుంది. ఐతే రాజు బాక్సింగ్ టైటిల్ కోసం కిల్లర్ రాజు (కబీర్ సింగ్) అనే క్రూరమైన బాక్సర్ తో తలపడాల్సి వస్తుంది. ఇంతకీ ఐదుగురు మిత్రులు రాజునే ఎందుకు బాక్సర్ అవ్వమని అడిగారు. కిల్లర్ రాజు ముందు ఈ రాజు నిలవగలిగాడా? టైటిల్ గెలిచాడా? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
‘తుంటరి’ ఫాంటసీ యాంగిల్ ఉన్న కథ. ఫాంటసీ అనగానే లాజిక్ చచ్చిపోతుంది కాబట్టి.. తర్కం గురించి ఆలోచించకుండా సినిమా చూస్తే ‘తుంటరి’ వేషాలు బాగానే అనిపిస్తాయి. మురుగదాస్ అందించిన కథ బాగానే ఉంది. కానీ దాన్ని అనుకున్నంత సీరియస్ గా నడపకపోవడం సినిమాలోని ప్రధానంగా చెప్పుకోవాల్సిన మైనస్. ఓ దశ వరకు ‘తుంటరి’లోని వినోదం బాగానే ఎంటర్ టైన్ చేస్తుంది. కానీ కథ సీరియస్ గా నడవాల్సిన సమయంలోనూ సరదాగానే నడిపించడంతో వస్తుంది సమస్య. అవసరానికి మించి ఫన్ డోస్ ఇచ్చేయడం.. పాటలు బ్రేకుల్లా అడ్డుపడటంతో ‘తుంటరి’ అనుకున్న స్థాయికి చేరదు.
ఐతే రెండు గంటల తక్కువ నిడివిలో ‘తుంటరి’ చాలా వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. లాజిక్కుల గురించి ఆలోచించకుండా.. కొన్ని సిల్లీ విషయాల్ని పట్టించుకోకుండా.. చూస్తే ‘తుంటరి’ ఓకే అనిపిస్తుంది. ‘తుంటరి’ రెగ్యులర్ మసాలా సినిమా అన్న అంచనాతో థియేటర్లోకి అడుగుపెట్టిన ప్రేక్షకుడికి ఇందులోని ఫాంటసీ యాంగిల్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రేక్షకుడిని నేరుగా కథలోకి ఇన్వాల్వ్ చేస్తాయి ఆరంభ సన్నివేశాలు. ఆ తర్వాత హీరో అల్లరి వేషాలతో ప్రథమార్ధం వేగంగానే సాగిపోతుంది.
హీరో హీరోయిన్ల రొమాన్స్ ఆకట్టుకోదు. రోహిత్ - లతా హెగ్డే మధ్య కెమిస్ట్రీ పండలేదు. హీరోయిన్ హీరోను ప్రేమించడానికి సరైన కారణం కనిపించదు. ఐతే ఇప్పటిదాకా ఎక్కువగా సీరియస్ వేషాలే వేసిన రోహిత్ అల్లరి చిల్లరి పాత్రలో పండించిన వినోదం బాగా వర్కవుటవడంతో చకచకా ఇంటర్వెల్ బ్రేక్ దగ్గరికి వచ్చేస్తాం. రోహిత్ తో పాటు షకలక శంకర్, వెన్నెల కిషోర్ కూడా బాగానే నవ్వించడంతో ప్రథమార్ధంలో వినోదానికి ఢోకా లేకపోయింది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టు షాకిస్తుంది. ఐతే ఇక్కడి నుంచి కథ సీరియస్ టర్న్ తీసుకుని.. ఎమోషనల్ గా సాగుతుందని ఆశిస్తాం. కానీ అలా ఏమీ జరగదు. బాక్సింగ్ లో ఓనమాలే తెలియని హీరో.. టోర్నీ మొదలయ్యే ముందైనా బాక్సింగ్ నేర్చుకుంటాడేమో అనుకుంటే అదేమీ చెయ్యడు. చార్లీ చాప్లిన్ తరహా అల్లరితోనే టోర్నీలో ఫైనల్ దాకా వచ్చేయడం సిల్లీగా అనిపిస్తుంది. ఈ సన్నివేశాలు ఫన్నీగా ఉన్నప్పటికీ.. లాజిక్ కు మరీ దూరంగా అనిపిస్తాయి.
ఐతే ప్రేక్షకుడు ఆశించిన ఎమోషన్ చివరి అరగంటలో వస్తుంది. హీరోలో ఎమోషన్ రావడానికి దారి తీసే సన్నివేశాలు రొటీనే అయినప్పటికీ.. పకడ్బందీగానే ఉన్నాయి. చివర్లో బాక్సింగ్ ఎపిసోడ్ కూడా అంచనాలకు తగ్గట్లే సాగినప్పటికీ.. ప్రేక్షకుడు ఎమోషనల్ గా కనెక్టయ్యేలా దీన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. నారా రోహిత్ తన మార్కు సీరియస్ నటనతో ప్రిక్లైమాక్స్ - క్లైమాక్స్ లో సినిమాను నిలబెట్టాడు. నిడివి తక్కువ కావడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఐతే ఇంత తక్కువ నిడివిలోనూ ఐదు పాటలు పెట్టడం టూమచ్. అందులోనూ ద్వితీయార్ధంలో వచ్చే రెండు పాటలూ పూర్తిగా అనవసరం అనిపిస్తాయి. ఓవరాల్ గా ‘తుంటరి’లో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్లున్నాయి. అలాగే కొన్ని మైనస్సులూ ఉన్నాయి.
నటీనటులు:
నారా రోహిత్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపించాడు ‘తుంటరి’లో. టైటిల్ కు న్యాయం చేసేలా తన అల్లరి నటనతో ఆకట్టుకున్నాడు రోహిత్. అతడి కామెడీ టైమింగ్ బాగుంది. సినిమాలో చాలా వరకు అల్లరిగానే కనిపించే రోహిత్.. చివర్లో అవసరానికి తగ్గట్లు సీరియస్ గానూ నటించి మెప్పించాడు. పతాక సన్నివేశాల్లో రోహిత్ నటన చాలా బాగుంది. హీరోయిన్ లతా హెగ్డే పర్వాలేదు. అందం - అభినయం రెండు విషయాల్లోనూ బలమైన ముద్రేమీ వేయదు. నాట్ బ్యాడ్ అనిపిస్తుంది. కబీర్ సింగ్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ - షకలక శంకర్ బాగానే నవ్వించారు. మిగతా వాళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
సాయికార్తీక్ పాటల్లో డైమండ్ గర్ల్.. వినసొంపుగా ఉంది. మిగతా పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం పతకా సన్నివేశాల్లో బాగుంది. మిగతా అంతా మామూలుగా అనిపిస్తుంది. పళని కుమార్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. బాక్సింగ్ ఎపిసోడ్ కు సంబంధించిన సన్నివేశాలు బాగా తీశాడు. లక్ష్మీభూపాల్ - శ్రీకాంత్ రెడ్డి కలిసి అందించిన మాటలు బాగానే ఉన్నాయి. కుమార్ నాగేంద్ర.. మురుగదాస్ అందించిన సీరియస్ కథకు కామెడీ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తమిళంలో కంటే తెలుగులోకి వచ్చేసరికి కామెడీ డోస్ పెంచాడు. ఇది ఒకరకంగా సినిమాకు మేలు చేస్తే.. ఇంకోరకంగా చెడు కూడా చేసింది. కామెడీ మీద, కమర్షియల్ అంశాల మీద ఎక్కువ దృష్టిపెట్టడంతో కొన్ని చోట్ల కథనం పక్కదారి పట్టింది. ఐతే మళ్లీ కథనాన్ని ట్రాక్ మీదికి తీసుకొచ్చి గమ్యాన్ని చేర్చాడు. దర్శకుడిగా అతడికి పాస్ మార్కులు పడతాయి.
చివరగా: తుంటరి.. టైంపాస్ ఎంటర్ టైనర్
రేటింగ్- 2.75/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre