Begin typing your search above and press return to search.
పార్కింగ్ ఫీజుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తుందా?
By: Tupaki Desk | 4 March 2021 6:30 AM GMTహైదరాబాద్ లాంటి మెట్రో నగరంలో నాలుగైదేళ్ల క్రితం నాటి మాట ఇది. నగరంలో మాల్స్ లో షాపింగుకి వెళితే పార్కింగ్ కి గంటకు రూ.20-30 చొప్పున ఎన్ని గంటలు పార్కింగ్ చేస్తే అన్ని గంటలకు ముక్కు పిండి వసూలు చేసి జనాల్ని బెంబేలెత్తించారు. సగటున నాలుగైదు గంటలకే వందల్లో ఫీజులు వసూలు చేసిన పాపం మాల్స్ ఓనర్లది.
ఈ వసూళ్లపై ప్రజలు అప్పట్లో నోరెళ్లబెట్టేవారు. నెమ్మదిగా దీనిపై ఈమీడియాతో పాటు పత్రికల్లోనూ రగడ మొదలైంది. మాల్స్ బాదుడుపై నా తినుబండారాలపై రేట్లపైనా తీవ్రమైన చర్చ సాగింది. ఇదంతా నాలుగైదేళ్ల నాటి మాట. అంత పెద్ద చర్చ జరిగాక ప్రభుత్వాలు స్పందించాయి. వెంటనే గులాబీ అధినేతలు కేసీఆర్- కేటీఆర్ రివ్యూ మీటింగుల అనంతరం అధికారులకు ఆజ్ఞలు అందాయి. వెంటనే పార్కింగుల్లో ఫీజును రద్దు చేశారు. ఒకే ఒక్క డెసిషన్ మాల్స్ తో పాటు మల్టీప్లెక్స్ ఓనర్లు సింగిల్ థియేటర్ల ఓనర్ల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆ తర్వాత ఎగ్జిబిటర్లు ఎన్నిసార్లు మొత్తుకున్నా తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఎంతమాత్రం మార్చుకోలేదు.
అయితే చాలాసార్లు పార్కింగ్ ఫీజు పై ఎగ్జిబిటర్లు తమ గోడు విన్నవించారు. టికెట్ తో కంటే పార్కింగ్ క్యాంటీన్ ఆదాయమే మిగులుతుందని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అస్సలు పట్టించుకున్నదే లేదు. ఇప్పటికీ అదే వ్యవస్థ అమలవుతోంది. అయితే కరోనా క్రైసిస్ తో తీవ్రంగా నష్టపోయిన సినీ ఎగ్జిబిటర్లు (సింగిల్ స్క్రీన్లు సహా).. మరోసారి తెలంగాణలో పార్కింగ్ ఫీజులకు వెసులుబాటు కల్పించాల్సిందిగా డిమాండ్ చేయడంతో దీనిపై చర్చ సాగుతోంది.
``నాలుగైదేళ్ల క్రితం మాల్స్ లో పార్కింగ్ ఫీజు పేరుతో ఎక్కువ చార్జీలు వసూలు చేసారు.. అది తప్పే`` అన్న చర్చా సాగింది. కానీ ఇప్పుడు వేరు. ``ఫ్రీ పార్కింగ్ వల్ల మేం ఎంతో నష్ట పోతున్నాం. నామినల్ పార్కింగ్ ఫీజు కల్పించండి`` అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడే పార్కింగ్ ఫీజులు లేవు...దయచేసి పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేలా సీఎం గారి కి విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ఎగ్జిబిటర్ సంఘాల అధ్యక్షులు మొర పెట్టుకున్నారు. ఇటీవల చిరంజీవి నాగార్జున వంటి సినీపెద్దలు సీఎం కేసీఆర్ గారిని కలసినప్పుడు అనేక వరాలను ప్రకటించారు. అవి వెంటనే అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని నివేదించారు.
నిజానికి పార్కింగ్ ఫీజు రద్దు వల్ల మాల్స్ వాళ్ల కంటే సినిమా స్క్రీన్లు ఉండే మల్టీప్లెక్సులు.. సింగిల్ స్క్రీన్ వాళ్లు నష్టపోయారన్నది ఓ విశ్లేషణ. అందుకే చాలా కాలంగా వారు ఈ డిమాండ్లు వినిపిస్తున్నారు. థియేటర్ రంగం ఇప్పటికే కష్టాల్లో ఉంది. అందుకే ఈ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తున్నారు. ముఖ్యంగా అంతగా ఆదాయం ఉండని సింగిల్ స్క్రీన్ల వాళ్ల సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరించాల్సి ఉంటుంది. అలాగే మాల్స్ తో కలిపేసి సినిమా స్క్రీన్లను సింగిల్ స్క్రీన్లను చూడడం సరికాదనే అభిప్రాయం ఉంది. సినీరంగం బావుండాలంటే కచ్ఛితంగా ఎగ్జిబిషన్ రంగానికి ప్రోత్సాహకాలుండాలని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. పార్కింగ్ ఫీజు.. క్యాంటీన్ ఆదాయంతో కొంతవరకూ కోలుకునేందుకు వెసులుబాటు ఉంటుందని అంటున్నారు.. కాబట్టి ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయనే ఆశిద్దాం.