Begin typing your search above and press return to search.

ప్ర‌దీప్ అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి

By:  Tupaki Desk   |   4 May 2017 10:34 AM GMT
ప్ర‌దీప్ అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి
X
బుల్లితెర న‌టుడు ప్ర‌దీప్ అనుమానాస్ప‌ద మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున త‌న బెడ్రూంలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న‌ట్లుగా చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఉదంతంపై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆయ‌న పోస్ట్ మార్టం నివేదిక వ‌చ్చిన త‌ర్వాత కానీ.. ఆయ‌న మృతికి కార‌ణం ఏమిట‌న్న దానిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌దీప్ అంత్య‌క్రియ‌ల‌ను ఈ రోజు పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ లోని మ‌హాప్ర‌స్థానంలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. ప్ర‌దీప్ మృత‌దేహాన్ని త‌ర‌లించే స‌మ‌యంలో ప్ర‌దీప్ త‌ల్లి.. భార్య పావ‌ని భోరున విల‌పించారు. వారి శోకం చూసిన వారి కంట త‌డి పెట్టించింది. మంగ‌ళ‌వారం రాత్రి ఇంట్లో చోటు చేసుకున్న చిన్న వివాద‌మే ఆత్మ‌హ‌త్యకు కార‌ణంగా పావ‌ని చెబుతున్నారు.

ప్ర‌దీప్ అంత్య‌క్రియ సంద‌ర్భంగా బుల్లితెర న‌టీన‌టులు.. ప‌లువురు టెక్నిషియ‌న్లు హాజ‌ర‌య్యారు. ప్ర‌దీప్ అనుమానాస్ప‌ద మృతి త‌మ‌ను విప‌రీతంగా బాధ పెట్టిన‌ట్లుగా వారు చెప్పుకొచ్చారు. నిన్న‌టి వ‌ర‌కూ త‌మ‌తో న‌వ్వుతూ.. హుషారుగా తిరిగిన వ్య‌క్తి తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయిన వైనం జీర్ణించుకోలేనిదిగా మారింద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/