Begin typing your search above and press return to search.

టీవీ సిరీస్‌ లో నటించాలంటే డేటింగ్ చేయ‌కూడ‌ద‌ట‌

By:  Tupaki Desk   |   15 Jun 2016 10:30 PM GMT
టీవీ సిరీస్‌ లో నటించాలంటే డేటింగ్ చేయ‌కూడ‌ద‌ట‌
X
సినిమా అయినా.. సీరియ‌ల్ అయినా.. ఇంకేదైనా షో అయినా.. అందులో చేయ‌బోయే ఆర్టిస్టులు.. టెక్నీషియ‌న్ల‌తో అగ్రిమెంట్లు చేసుకోవ‌డం మామూలే. పారితోష‌కం ద‌గ్గ‌ర్నుంచి అందులో అనేక విష‌యాల‌కు సంబంధించిన క్లాజులుంటాయి. అన్నీ చ‌దువుకున్నాకే సంత‌కం పెడ‌తారు ఎవ‌రైనా. ఐతే ఓ హిందీ టీవీ సిరీస్‌ నిర్మాత‌లు మాత్రం ఇంత‌కుముందెన్న‌డూ చూడ‌ని విచిత్ర‌మైన ష‌ర‌తు విధించారు. త‌మ‌ టీవీ సిరీస్‌ లో చేయాల‌ని ఆశ‌ప‌డేవాళ్లు.. ఈ షో న‌డిచినంత కాలం ఎవ‌రితోనూ డేటింగ్ చేయ‌బోమ‌ని.. సింగిల్ గానే ఉంటామ‌ని పేర్కొంటూ అగ్ర‌మెంట్ మీద సంత‌కం చేయాల‌ని ష‌ర‌తు విధించారు.

రిష్టన్ కా సౌదాగర్- బాజీగర్ అనే టీవీ సిరీస్ కోసం పెట్టిన ష‌ర‌తు ఇది. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లకు ఎంపికైన వత్సల్ సేథ్.. ఇషితా దత్తా నిర్మాత‌లు కోరిన‌ట్లే 'నో డేటింగ్' క్లాజ్ కు అంగీక‌రిస్తూ ఒప్పంద పత్రాల పై సంతకాలు చేశారు. ఈ సీరియల్ త్వరలోనే ప్రసారం కానుంది. ఐతే ఇలా 'నో డేటింగ్' క్లాజ్ చేర్చడాన్ని ముందు చాలామంది న‌టీన‌టులు వ్య‌తిరేకించార‌ట‌. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని.. ఈ ష‌ర‌తుకు ఒప్పుకుని ఇందులో న‌టించ‌లేమ‌ని చెప్పేసి వెళ్లిపోయార‌ట. అయినా నిర్మాత‌లు మ‌న‌సు మార్చుకోలేద‌ట‌. త‌మ ష‌రతుకు అంగీక‌రించిన వ‌త్స‌ల్.. ఇషికాల‌కే ఛాన్సిచ్చారు. వాళ్ల‌తోనే షూటింగ్ చేశారు.