Begin typing your search above and press return to search.
ఆ `ఒక్క చాన్స్` రాకుండానే తనువు చాలించింది!
By: Tupaki Desk | 12 April 2018 2:02 PM GMTఒక్క చాన్స్ ఒకే ఒక్క చాన్స్....అంటూ సినిమాల్లో నటించే అవకాశం కోసం ఓ నిర్మాతని హీరోయిన్ అభ్యర్ధిస్తోన్న పాపులర్ డైలాగ్ మనం వినే ఉంటాం. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు....ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో...ఆ ఒక్క సీన్ లో చూపించేశారు. అయితే, ఆ ఒక్క చాన్స్ రాకుండానే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారు కొందరైతే....ఆ ఒక్క చాన్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూ.....నానా ఇబ్బందులు పడుతున్న వారు మరికొందరు. ఆ చాన్స్ కోసం ఇష్టం లేకపోయినా కామాంధుల లైంగిక వాంఛలు తీర్చి....అసలు ఆ చాన్స్ రాకుండానే....తమ కడపటి ఆశ తీరకుండానే....అర్ధాంతరంగా తరలిరాని లోకాలకు మరలుతున్న వారు ఇంకొందరు. తాజాగా, హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఓ యువతి హైదరాబాద్ లో దిక్కు లేని చావు చచ్చింది. కాస్టింగ్ కౌచ్ కు బలై....ప్రేమించినవాడి చేతిలో మోసపోయి....ప్రాణాంతక వ్యాధితో అనారోగ్యం పాలై అనాథలా మరణించింది.
సినిమా రంగంలో రాణించాలనే ఉద్దేశ్యంతో చాలా మంది అమ్మాయిల్లాగే ఆ యువతి హైదరాబాద్ లో అడుగుపెట్టింది. సినిమాల్లో అవకాశాల కోసం తెలిసిన వారిని తెలియని వారిని బ్రతిమిలాడుకుంది....ఒక్క చాన్స్ ఇప్పించాల్సిందిగా వారి కాళ్లా వేళ్లా పడింది. అయితే, ఆమెకు కొన్ని సీరియళ్లలో అవకాశం దక్కింది. కానీ, సినిమాల్లో అవకాశం కోసం ఎందరి చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. అవకాశం ఇప్పించకపోగా ...సినిమాల్లో చాన్స్ ఇస్తామంటూ....ఆ యువతి జీవితంతో కామాంధులు ఆడుకున్నారు. ఆమెను ఇష్టం వచ్చినట్లు వాడుకుని అవకాశాలు ఇవ్వకుండా తమ లైంగిక వాంఛలు తీర్చుకొని ఆమెను మోసం చేశారు. ప్రేమపేరుతో దగ్గరై పెళ్లి చేసుకున్న వాడి ద్వారా ఆమెకు ప్రాణాంతక హెచ్ ఐవీ సోకింది. పాప పుట్టాక....ఆమెను అతడు వదిలేసి వెళ్లిపోయాడు. నా అనే వారిని చేరుకోలేక...కట్టుకున్న వాడి జాడ తెలియక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆమె అనారోగ్యంతో అర్ధాంతరంగా తనువు చాలించింది. అంత్యక్రియలు చేసేవారు లేక దిక్కులేని అనాథ శవమైంది. చివరకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆమెకు అంత్యక్రియలు నిర్వర్తించి తమ ఉదారతను చాటుకుంది. ఇటువంటి వారి కోసమే నటి శ్రీరెడ్డి పోరాడుతోందని, ఇకనైనా టాలీవుడ్ పెద్దలు, `మా` సభ్యులు, ప్రభుత్వం....కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై స్పందించాలని నెటిజన్లు కోరుతున్నారు.