Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ తో షూటింగ్స్ లేక మేకప్ మన్ వద్ద అప్పు చేసిన నటి
By: Tupaki Desk | 17 May 2020 3:51 AM GMTకరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ లేక సినీ మరియు టీవీ కార్మికులు ఎంతటి ఇబ్బందులకు గురి అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలు హీరోయిన్స్ కు పెద్దగా ఇబ్బంది లేక పోయినా రోజు వారి పారితోషికంతో నటించే వారు.. టెక్నీషియన్స్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా షూటింగ్స్ అన్ని బంద్ ఉండటంతో చేతిలో ఉన్న డబ్బులు పూర్తి అయ్యి ఇప్పుడు వేరే వాళ్ల వద్ద అప్పులు చేసి ఇంటి అద్దెలు చెల్లించడంతో పాటు నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు.
బుల్లి తెర నటి సోనాల్ వెంగర్లేకర్ పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఆమె తన మేకప్ మన్ వద్ద రూ.15 వేలు అప్పుగా తీసుకుందట. రెండు నెలలుగా షూటింగ్స్ లేక పోవడంతో చేతిలో డబ్బులు లేకుండా అయ్యింది. ఒక నిర్మాత డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కూడా అతడు ఫోన్ చేస్తే స్పందించలేదు. మళ్లీ మళ్లీ ఫోన్ చేయగా ఈమె నెంబర్ బ్లాక్ చేశాడట. దాంతో తన పరిస్థితి అర్థం అయ్యి మేకప్ మన్ పంకజ్ గుప్తా తన భార్య డెలవరీ కోసం దాచుకున్న డబ్బును ఇచ్చాడంటూ ఎమోషనల్ అయ్యింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.