Begin typing your search above and press return to search.
వివాదాల బాస్.. బిగ్ బాస్ 3
By: Tupaki Desk | 14 July 2019 8:25 AM GMTబిగ్ బాస్.. ఇదొక రియాలిటీ షో.. అంతకంటే ఎక్కువగా వివాదాల షోగా పాపులారిటీ సంపాదించుకుంది. అనేక ఆటంకాలను దాటుకుని రెండు సీజన్లను పూర్తి చేసుకుని మూడో సీజన్ కు రెడీ అవుతోంది. మరో వారం రోజుల్లో బిగ్ బాస్-3 ప్రారంభమవుతున్న వేళ.. అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ వివాదాల పరంపరలోనే జర్నలిస్టు శ్వేతారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అలాగే మరికొందరు కూడా బిగ్ బాస్ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇందులో ప్రధాన అంశం మాత్రం శ్వేతారెడ్డిదే.
బిగ్ బాస్ నిర్వాహకులు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనను ముంబయి నుంచి బిగ్ బాస్ మేకర్స్ - మా టీవీ కో ఆర్డినేటర్లు సంప్రదించారని - ఈ షోలో పాల్గొనేందుకు తాను కూడా అంగీకారం తెలిపానని శ్వేతారెడ్డి ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాచారమూ కూడా ఆమెనకు అందలేదట. అనేక సార్లు.. అసలు తనకు అవకాశం ఉందా లేదా.. అని ఫాలోఅప్ చేశారట.
చివరకు.. ఓ రెస్టారెంట్ లో ఆమెను కలిసేందుకు మాటీవీ కో ఆర్డినేటర్లు శ్యాం - రఘు ఒప్పుకున్నారట. ఈ సందర్భంగా బిగ్ బాస్ ను ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తారు..? అంతకుమించి మరేం చేస్తారు..? అని వారు తనను అడిగారని శ్వేతారెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ నిర్వహాకులపై జర్నలిస్టు శ్వేతారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ మేరకు బిగ్‌బాస్-3 నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు నలుగురిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. తనను ఎంపిక చేసినట్టుగా అగ్రిమెంట్ పత్రం ఇవ్వకుండా వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు.
నిర్వాహకులు రవికాంత్ - రఘు - అభిషేక్ - శ్యాం తనను శ్రీనగర్ కాలనీలోని ఓ రెస్టారెంట్ కు పిలిచి... బిగ్ బాస్ కాంటెస్ట్ లో చేయాలంటే బాస్ ను ‘ఇంప్రెస్’ చేయాలంటూ షరతులు విధించారన్నారు. రవికాంత్ - రఘు - అభిషేక్ - శ్యాంపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని బంజారాహిల్స్ సీఐ కళింగరావు తెలిపారు.