Begin typing your search above and press return to search.

అందరూ వద్దు.. మహేష్‌ ముద్దు

By:  Tupaki Desk   |   9 Feb 2016 5:30 PM GMT
అందరూ వద్దు.. మహేష్‌ ముద్దు
X
మాములుగా ఒకప్పుడు ఉన్నంత శాటిలైట్‌ మార్కెట్‌ ఇప్పుడు లేదు అంటుంటారు విశ్లేషకులు. కాని నిజానికి అది పెద్ద అబద్దం. ఎందుకంటే.. టివిల్లో ఒక సినిమా వేస్తున్నారంటే ఇప్పుడు కూడా భారీ రేంజ్‌ వ్యూయర్‌ షిప్‌ ఉంది. కృతిమంగా డెఫిసిట్‌ ను క్రియేట్‌ చేసి.. చిన్న సినిమాలను కొనడం మానేసి.. వాటిని ఫ్రీగా (తక్కువ రేట్లో అనుకోండి) కొట్టేయడానికి అలవాటు పడ్డారే కాని.. టివి ల్లో సినిమా వేస్తే ఆ క్రేజే వేరు. అందుకే మరి రెండున్నర గంటల బాహుబలి సినిమాను టివి లో వేస్తే.. దాదాపు 5 గంటల రన్‌ టైమ్‌ వచ్చింది. ఎందుకంటే రెండున్నర గంటలు యాడ్లు వచ్చాయి కాబట్టి. 15 కోట్లు (1వ భాగానికి) పెట్టి కొనేసిన సినిమాకు ఒక్క ఎయిరింగ్‌ తోనే 10+ కోట్లు కలెక్షన్‌ వచ్చిందని టివి వర్గాల్లో టాక్‌.

ఇకపోతే.. తెలుగులో మొన్న సంక్రాంతికి రిలీజైన డిక్టేటర్‌ - నాన్నకు ప్రేమతో - సోగ్గాడే చిన్ని నాయనా - ఎక్స్‌ప్రెస్‌ రాజా సినిమాల్లో మూడు సినిమాలను ఒకటే ఛానల్‌ కొనేసింది. నాలుగో సినిమా కూడా వారిదే కాని.. థర్డ్‌ పార్టీ ద్వారా కొనేలా చేశారులే. ఇప్పుడేమో ఇంకో ఛానల్‌ వారున్నారు. వారు ఈ సినిమాల్లో ఒక్క దానికి కూడా కనీసం బిడ్‌ వేయకపోవడం గమనార్హం. వీళ్ళందరి సినిమాలను 4..5..6.. కోట్లు ఇచ్చి కొనేబదులు.. ఒక 20 కోట్లు పెట్టి ఏకంగా మహేష్‌ బాబు సినిమాలను కొంటున్నారు. అప్పుడు శ్రీమంతుడు.. ఇప్పుడు బ్రహ్మోత్సవం అలాగే కొన్నారు. మిగతావారి సినిమాలన్నీ వేసినా.. ఒక్క మహేష్‌ సినిమా ఒక్కటే వేసినా కూడా.. అంతే లాభం వస్తుందనేది వీరి నమ్మకం. సూపరమ్మా.

అయితే కేవలం పెద్ద స్టార్లు పెద్ద నిర్మాతలూ పెద్ద దర్శకుల సినిమాలే కాకుండా.. అప్పుడప్పుడూ ఒక కోటి రూపాయల బడ్జెట్‌ లో చిన్న సినిమాలను కూడా కొంటూ ఉండండి గురూ.