Begin typing your search above and press return to search.

షాక్‌: 'స‌ప్త‌మాత్రిక' హీరో ఆత్మ‌హ‌త్య‌

By:  Tupaki Desk   |   3 May 2017 8:16 AM GMT
షాక్‌: స‌ప్త‌మాత్రిక హీరో ఆత్మ‌హ‌త్య‌
X
టీవీ న‌టుడు.. స‌ప్త‌మాత్రిక సీరియ‌ల్ లో హీరో అయిన ప్ర‌దీప్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసిన ఘ‌ట‌న ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ రోజు తెల్ల‌వారుజామున ఇంట్లో ఎవ‌రూ లేని వేళ‌లో ఆయ‌న ఉరి వేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌టంపై కుటుంబ స‌భ్యులు.. అత‌ని స్నేహితులు.. బంధు వ‌ర్గాలు తీవ్ర దిగ్భాంత్రికి గురి అవుతున్నాయి. రాత్రి వ‌ర‌కూ షూటింగ్‌ లో హుషారుగా పాల్గొన్న ప్ర‌దీప్‌.. తెల్ల‌వారేస‌రికి ఉరి వేసుకొని విగ‌త‌జీవిగా మారిన వైనం ఇప్పుడు మిస్ట‌రీగా మారింది.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌లం పుప్పాల గూడ అక్కాపురి కాల‌నీలోని గ్రీన్ హోం అపార్ట్ మెంట్‌ లో ప్ర‌దీప్ సూసైడ్ చేసుకున్నారు. ఈ మ‌ధ్య‌నే వారు ఆ ఇంటికి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. కాల‌నీ వారితో పాటు.. అపార్ట్ మెంట్ వాసుల‌తోనూ ప్ర‌దీప్‌ కు పెద్ద‌గా సంబంధాలు లేవ‌ని తెలుస్తోంది. గ‌త ఏడాది స‌హ న‌టి పావ‌నిరెడ్డితో వివాహం జ‌రిగింద‌ని.. ఇరువురు బాగానే ఉండేవార‌ని చెబుతున్నారు.

నిన్న‌టివ‌ర‌కూ బాగానే ఉన్న ప్ర‌దీప్‌.. తెల్ల‌వారేస‌రికి ఈ ర‌కంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం ఏమిట‌న్న‌ది అంతుచిక్క‌నిదిగా మారింది. ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం ఏమిట‌న్న విష‌యంపై ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు. ఆర్థిక స‌మ‌స్య‌లు ఆత్మ‌హ‌త్య‌కు ఎంత‌మాత్రం కాద‌ని.. క‌టుంబ క‌ల‌హాలు ఏమైనా ఉన్నాయా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఈ ఉదంతంపై స‌మాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని.. ప్ర‌దీప్ స‌తీమ‌ణి పావ‌నిరెడ్డి స్టేట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ అంశంపై ద‌ర్యాప్తు అనంత‌ర‌మే మ‌రింత స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌న్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/