Begin typing your search above and press return to search.

సల్మాన్ 12 కోట్ల విరాళం.. తూచ్..

By:  Tupaki Desk   |   27 Aug 2018 3:45 PM IST
సల్మాన్ 12 కోట్ల విరాళం.. తూచ్..
X
కేరళను వర్షాలు ముంచెత్తి వరద పోటెత్తింది. ఆ వరదలకు ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. తిండి - నిద్ర కరువై సహాయక శిభిరాల్లో తలదాచుకుంటున్నారు. కేరళ వాసుల కష్టాలు చూసి ఇప్పటికీ దేశవిదేశీ వ్యాప్తంగా ప్రముఖులు - సంస్థలు స్పందించి ఆర్థికసాయం చేస్తున్నాయి. ఈ కోవలోనే సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున ఆర్థికసాయం చేస్తున్నారు.

అయితే తాజాగా నటుడు జావేద్ జాఫెరీ ట్విట్టర్ లో చేసిన ఓ ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ట్వీట్ లో ‘బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ ఏకంగా 12 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించినట్లు’ పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ అభిమానులు మా హీరో మంచి వాడంటూ తెగ షేర్లు చేసి సల్మాన్ ను అభినందనలతో ముంచెత్తారు.

కానీ ఇంతలోనే ఏమైందో కానీ జావేద్ జాఫెరీ ఆ ట్వీట్ ను తొలగించారు. దాని స్థానంలో మరో ట్వీట్ చేశారు. ‘కేరళ వరద బాధితుల కోసం సల్మాన్ ఖాన్ 12 కోట్ల విరాళం వార్తను నేను కేవలం విన్నాను. సల్మాన్ కు ఆ డబ్బు ఓ లెక్క కాదు.. కానీ ఆయనే అధికారికంగా ప్రకటిస్తారు.. బాధితులను ఆదుకోవడంలో సల్మాన్ ముందు ఉంటారు.. నాకు మాత్రం అధికారికంగా సల్మాన్ చేసి సాయం గురించి తెలియదు’ అంటూ కవర్ చేశారు. దీన్ని బట్టి సల్మాన్ ఖాన్ 12 కోట్ల విరాళం అనేది వట్టి మాటే అని తేలిపోయింది. ఒకవేళ సల్మాన్ విరాళం ఇచ్చినా ప్రచారానికి దూరంగా 12 కోట్లు పంపించారా అన్నది తెలియాల్సి ఉంది.