Begin typing your search above and press return to search.

ఒకే రోజు 12 సినిమాలు కానీ

By:  Tupaki Desk   |   10 Jun 2019 12:30 PM GMT
ఒకే రోజు 12 సినిమాలు కానీ
X
ఒకపక్క థియేటర్లకు ఫీడింగ్ ఇచ్చే సరైన సినిమాలు లేక ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. గత మూడు నెలల్లో మహర్షి మినహాయించి గట్టిగా బ్లాక్ బస్టర్ అని చెప్పుకునేది ఒక్కటీ లేక పరిస్థితి చాలా దీనంగా ఉంది. ప్రతి గురు శుక్రవారాలు కొత్తవి వస్తున్నట్టే ఉన్నాయి పోతున్నట్టే ఉన్నాయి. రెగ్యులర్ గా చూసే అలవాటు ఉన్న మూవీ లవర్స్ కి సైతం తెలియకుండా కొన్ని వేగంగా మాయమవుతున్నాయి అంటే బాక్స్ ఆఫీస్ సిచువేషన్ గురించి ఇంత కంటే ఏం చెప్పగలం. మొన్న వచ్చిన హిప్పీ-సెవెన్ లు ఇప్పటికే దుకాణం సర్దేపనిలో ఉండగా కొంచెం బెటర్ అనిపించిన కిల్లర్ వైపు చూసే నాధుడు లేడు. ఇక సల్మాన్ భారత్ కూడా స్లో అయిపోయింది.

ఇక ఈ శుక్రవారం జూన్ 14న తెలుగు-హిందీ-ఇంగ్లీష్ కలిపి మొత్తం 12 సినిమాలు రాబోతున్నాయి. ఇంకేం పండగ అనుకునే ఛాన్స్ లేదు. అన్ని మీడియం లేదా లో బడ్జెట్ మూవీస్ కావడమే మరీ ప్రత్యేకంగా ఫీలయ్యే అవకాశం ఇవ్వడం లేదు. థ్రిల్లర్ జానర్ లో వస్తున్న విశ్వామిత్ర మీద ఏమంత బజ్ లేదు. గీతాంజలి దర్శకుడు రాజ్ కిరణ్ టేకప్ చేసిన ఈ మూవీ ఇప్పటికే పలు వాయిదాలు పడి ఈ డేట్ లాక్ చేసుకుంది. సప్తగిరి హీరోగా రూపొందిన వజ్రకవచధరి గోవిందా మీద ఓ వర్గం మాస్ ఆడియన్స్ తప్ప అందరూ లుక్కేసే ఛాన్స్ లేదు. టాక్ మరీ బాగుంటే ఏమైనా ఆశించవచ్చు. ఉపేంద్ర కన్నడ డబ్బింగ్ ఐ లవ్ యు కూడా ఇదే తరహాలో హైప్ లేకుండా వస్తోంది.

జనవరిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాలీవుడ్ మూవీ యుఆర్ ఐని తెలుగులోకి డబ్ చేశారు. ఇప్పటికే దీని ఒరిజినల్ వెర్షన్ ఆన్ లైన్ లో హల్చల్ చేస్తోంది . తాప్సీ గేమ్ ఓవర్ కూడా ఇదే వరస. స్పెషల్ అనే మరో మూవీ కూడా రేస్ లో ఉంది. ఇవి కాకుండా ఎక్-ఖమోషి-కిస్సే బాజ్-వన్ డే హింది సినిమాలు వస్తున్నాయి. హాలీవుడ్ నుంచి మెన్ ఇన్ బ్లాక్ ఇంటర్నేషనల్- సీక్రెట్ లైఫ్ అఫ్ పెట్స్ 2 వస్తున్నాయి. మొత్తంగా సందడి భారీగా ఉంది కాని సౌండ్ చేసేవి మాత్రం ఏవి లేకపోవడం అసలు షాక్