Begin typing your search above and press return to search.
ఇంటికి రా..చంపేస్తా.. హీరో భర్తకు ట్వీట్ వార్నింగ్
By: Tupaki Desk | 6 March 2019 10:32 AM GMTఇంతకీ ఎవరీ సినీ ప్రముఖులు.. మరీ ఇంత దారుణంగా తిట్టేసుకుంటున్నారు? ఇంతకీ వారి మధ్య అంత పెద్ద గొడవేం జరిగింది? అంటారా? రీల్ హీరో భర్త రియల్ గా చేసిన షాకింగ్ స్టంట్ కు షాక్ తిన్న సీనియర్ నటిమణి అయిన భార్య ఇచ్చిన ట్వీట్ వార్నింగ్ ఇది. అయితే.. ఇదంతా గొడవతో కాదు.. భర్త మీద ఉన్న ప్రేమతో ఆమె ఈ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ.. ఎవరా సినీ ప్రముఖులంటే..
బాలీవుడ్ సక్సెస్ ఫుల్ నటుల్లో అక్షయ్ కుమార్ ఒకరు. భారీ బడ్జెట్ సినమాలు కాకున్నా.. ఆయన నటించిన సినిమాలు వరుస పెట్టి మరీ హిట్ల మీద హిట్లు కొడుతున్నాయి. ఇలాంటి వేళ.. ఆయన ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఒంటికి మంటలు అంటించుకొని మరీ స్టేజ్ మీదకు వచ్చిన ఆయన సాహసోపేతమైన చర్య అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. గుండెలు అదిరిపోయేలా ఉందని చెప్పాలి. ది ఎండ్ అనే వెబ్ సిరీస్ కోసం ఆయన చేసిన ఈ సాహసం అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.
మరి ఇలాంటి సాహసం చేసిన వ్యక్తి ఇంట్లో ఎలాంటి రియాక్షన్ ఉందన్నది తాజాగా అక్షయ్ సతీమణి.. సీనియర్ సినీ నటి ట్వింకిల్ ఖన్నా రియాక్ట్ అవుతూ.. నీ ఒంటికి నువ్వే నిప్పు అంటించుకున్నావా? ఏమనుకుంటున్నావ్? ఇంటికి రా.. నిన్ను చంపేస్తా. ఒకవేళ బతికి ఉంటే దేవుడా నాకు సాయం చేయంటూ ఆమె ట్వీట్ చేశారు.
ప్రాణంగా ప్రేమించే భర్త చేసిన సాహసం ఏ భార్యకైనా మంట పుట్టిస్తుంది. అందులోకి అత్యంత ప్రమాదకరమైన నిప్పుతో చెలగాటమాడిన భర్త సాహసంతో ప్రేమతో కూడిన కోపంతో చేసిన ట్వీట్ కు అక్షయ్ రియాక్ట్ అయ్యారు. ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉంది. ట్వింకిల్ ఎలాంటి శిక్ష విధిస్తుందో అంటూ రీట్వీట్ చేశారు. వీరిద్దరి ట్వీట్ సంభాషణ నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటుంది. నిప్పుతో ఆటాడుకున్న అక్షయ్.. భార్య కోపానికి భయం నటించటం ఆసక్తిగా మారింది. ఇక.. ఈ స్టార్ నటిస్తున్న వెబ్ సిరీస్ గురించి పెద్దగా చెప్పట్లేదు. కాకుంటే.. తన కొడుకు చేయమన్నందుకే తాను వెబ్ సిరీస్ కు ఓకే చెప్పినట్లుగా వెల్లడించారు.