Begin typing your search above and press return to search.
భర్తల కోసం ఉపవాసం వేస్ట్
By: Tupaki Desk | 10 Oct 2017 10:59 AM GMTఎన్నో మతాలు ఎన్నో ఆచారాలు అలాగే ఎంతో మంది దేవుళ్లు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఎవరి ఆచారాలు వారివి. ఎవరి నమ్మకం వారిది అని కొంతమంది అంటుంటే.. మరి కొందరు వాటిపై కామెంట్స్ చేసి అనవసరంగా వివాదాస్పదంగా మార్చుకుంటున్నారు. చాలా వరకు సెలబ్రెటీ హోదాలో ఉన్నవారు ఇతరుల ఆచారాలను మతాలను గౌరవిస్తారు. మరికొందరైతే కామెంట్స్ చేసి లేని పోనీ తలనొప్పులు తెచ్చి పెట్టుకుంటారు.
రీసెంట్ గా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో ఇతర ఆచారాలపై సైటైర్లు వేశారు. ఉత్తరాది మహిళలు ఎక్కువగా ఆచారాలను పాటిస్తారు. ఇందులో భాగంగా భర్త నిండు నూరేళ్ల ఆయుష్షుతో ఉండాలని కర్వాచౌత్ పర్వదినాన్ని జరుపుకుంటారు. అయితే ఆ పండుగలో వారు ఉపవాస దీక్షను చేస్తారు. మరుసటి చంద్రోదయం భర్త ముఖాన్ని జల్లెడ చాటున చూసేంత వరకు మంచి నీళ్లు కూడా ముట్టరు. అయితే ఈ ఆచారంపై ట్వింకిల్ ఖన్నా ఈ విధంగా స్పందించింది. భర్తల ఆరోగ్యం బాగుండాలంటే ముందు వారి జీర్ణ క్రియ బావుండాలి. అంతే గాని భార్యలు ఉపవాసాలు ఉంటే సరిపోదని ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఆమె ఒక ఉదాహరణని కూడా చెప్పారు. రీసెంట్ గా శాస్త్ర వేత్తలు జరిపిన ఒక పరీక్షలో కొన్ని జంతువుల జీర్ణ క్రియ బాగున్నందుకే అవి ఎక్కువ కాలం బ్రతికాయని కామెంట్ చేసింది.
దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ కామెట్స్ కి కొందరు సపోర్ట్ గా నిలుస్తుంటే మరికొందరు కోపంగా కామెంట్స్ చేస్తున్నారు. ట్వింకిల్ ఖన్నా ఈ తరహాలో కామెంట్స్ చేయడం కొత్తేమి కాదు. ఆమె అంతకు ముందు కూడా 'ఈ కాలంలో 40 ఏళ్లు దాటగానే చాలామంది మగవారు రెండో పెళ్లి చేసేసుకుంటున్నారు. వారికోసం ఉపవాసం చేయడం టైమ్ వేస్ట్' అని కామెంట్ చేశారు.