Begin typing your search above and press return to search.
మాతృత్వంపై స్టార్ హీరో వైఫ్ బోల్డ్ సందేశం
By: Tupaki Desk | 10 Oct 2022 2:30 AM GMTబాలీవుడ్ సెలబ్రిటీ వైవ్స్ బోల్డ్ అండ్ డస్కీ యాటిట్యూడ్ పై వెబ్ సిరీస్ లే తెరకెక్కాయి. ఫ్యాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ ( Fabulous Lives of Bollywood Wives) బంపర్ హిట్ సిరీస్ గా అలరించింది. ఆధునిక భావాలతో స్వేచ్ఛగా జీవించాలనుకునే ధనవంతులైన భార్యామణుల కథలు సిరీస్ లుగా ఎంతో ఆకర్షిస్తున్నాయి. చాలా మంది బాలీవుడ్ అందాల నాయికలు భార్యామణులు తమలోని బోల్డ్ యాటిట్యూడ్ ని ఏనాడూ దాచుకోలేదు.
తాజాగా కిలాడీ అక్షయ్ కుమార్ భార్యామణి ట్వింకిల్ ఖన్నా తనలోని ఆర్టిస్టును బయటపెట్టింది. 16 వయసులో తాను గీసిన ఓ చిత్తరువు తాలూకా డీటెయిల్స్ ని వెల్లడిస్తూ అద్భుతమైన కవితను చెప్పింది.
నేను ఇది (తాను గీసిన ఆర్ట్) చూసినప్పుడు.. మా చిన్నారి (కుమార్తె) నాపై ముడుచుకుని కూచుంది. మేము కలిసి ఉన్నాము. నా పక్కటెముక నుండి ఆమె చేయి.. ఆమె తల... నా భుజంలో ఒక భాగం లాగుతోంది. ఆమె తాజాగా నూనె రాసుకున్న జుట్టు నా చొక్కాకి మరకలు పెడుతోంది. చిట్టి భుజం నా వైపు తిరిగింది.
అది మరెవరైనా మానవుడైతే (ఇంకెవరైనా) ఆ వాలిన శరీరాన్ని గది అంతటా ఎగిరిపోయేంత శక్తితో నేను కదిలించి ఉండేదానిని. కానీ నేను అసౌకర్యానికి ఆనందానికి మధ్య ఊగిస లాడుతూ కూర్చున్నాను. అది నిజంగా తల్లి అనే సారాంశం కాదా? అని రాసారు. అలాగే ఫేమస్ ఆర్టిస్టు డోనాహ్యూ (పెయింటర్) మాతృత్వం తాలూకా ఈ బాధాకరమైన వైరుధ్యాన్ని అద్భుతంగా సంగ్రహించారు... అంటూ ట్వింకిల్ అన్నారు.
మాతృత్వం అనుభవానికి సంబంధించిన ఈ పెయింటింగ్ లు నిజంగా ప్రయోగాత్మకమైనవి. 39 ఏళ్ల మాడెలైన్ డోనాహ్యూ ఎల్లప్పుడూ కుటుంబ ఆలోచనపై ఆసక్తిని కలిగి ఉన్నారు. నాకు 16 ఏళ్ళ వయసులో దొరికిన ఛాయాచిత్రాల నుండి కుటుంబ చిత్రాలను తిరిగి సృష్టించడం చేసేదానినిని. నా పెయింటింగ్ ల దృష్టి అంతా ఫ్యామిలీ చుట్టూనే ఉండేది! అని ఆమె పేరెంటింగ్ కాలమిస్ట్ అమీల్ నియాజీకి చెప్పింది.
నేను ఎప్పుడూ ఇష్టపడే ఈ ఛాయాచిత్రాలన్నింటినీ నేను వెతుకుతుంటాను.. కనుగొంటాను. మా అమ్మ నన్ను ఎత్తుకున్నప్పటి తీరు.. పట్టుకున్న వ్యక్తీకరణ చిత్రాలు... ఆర్ట్ గా గీశాను. మా నాన్న నన్ను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఎలా చూసేవారో బొమ్మ రూపంలో గీసాను. నేను ఎల్లప్పుడూ కుటుంబ సాన్నిహిత్యంపై ఆసక్తిని కలిగి ఉంటాను అని తెలిపింది. ట్వింకిల్ ఖన్నా బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల్లో నటించారు. అక్షయ్ కి భార్య అయ్యాక పూర్తిగా గృహిణిగానే కుటుంబ బాధ్యతలు పిల్లల బాధ్యతలు స్వీకరించారు. టీవీ కార్యక్రమాల్లోనూ కనిపిస్తున్నారు.