Begin typing your search above and press return to search.

25 కోట్ల విరాళం.. హీరో భార్యపై నెటిజన్స్‌ ట్రోల్స్‌

By:  Tupaki Desk   |   29 March 2020 10:30 PM GMT
25 కోట్ల విరాళం.. హీరో భార్యపై నెటిజన్స్‌ ట్రోల్స్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కరోనా విపత్తు నేపథ్యంలో పీఎం సహాయ నిధికి పాతిక కోట్ల రూపాయల విరాళంను ఇచ్చిన విషయం తెల్సిందే. అక్షయ్‌ కుమార్‌ పాతిక కోట్లు ఇవ్వడంను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఎన్ని వందల కోట్లు ఉన్నా కూడా ఇచ్చే మంచి మనసు ఉన్న వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటిది అక్షయ్‌ ఏకంగా పాతిక కోట్లు విరాళంగా ప్రకటించడం అనేది చిన్న విషయం కాదంటూ చాలా మంది సోషల్‌ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సమయంలోనే ఆయన భార్య ట్వింకిల్‌ ఖన్నా చేసిన ఒక ట్వీట్‌ తో కొందరు నెటిజన్స్‌ ట్రోల్స్‌ కు గురవుతుంది.

అక్షయ్‌ కుమార్‌ 25 కోట్ల విరాళం ఇవ్వడంపై ట్వింకిల్‌ స్పందిస్తూ.. ఈ సమయంలో నా భర్త 25 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి నేను గర్వపడేలా చేశాడు. అయితే విరాళం ప్రకటించే ముందు ఒక్కసారి ఆలోచించుకో మనకు ఖర్చులకు కూడా కావాలి కదా అన్నాను. ఇంత మొత్తం ఇస్తే తర్వాత మన పరిస్థితి ఏంటీ అంటూ నేను ప్రశ్నించగా అందుకు అక్షయ్‌ నా కెరీర్‌ ఆరంభం సమయంలో నా దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ పరిస్థితుల్లో ఏమీ లేని వారికి సాయం చేయకుండా ఎలా ఉండగలను అన్నాడు అంటూ ట్వీట్‌ చేసింది.

పాతిక కోట్ల విరాళం ప్రకటిస్తూ ఉంటే ఆలోచించుకో అంటూ అక్షయ్‌ కు సలహా ఇచ్చాను అంటూ చెప్పిన ట్వింకిల్‌ ను ట్రోల్స్‌ చేస్తున్నారు. ఫోర్బ్స్‌ జాబితాలో నెం.1 స్థానంలో నిలిచిన అక్షయ్‌ పాతిక కోట్లు ఇస్తే ఏమీ లేని వాడు అవుతాడా. ఒక్క ఏడాదిలో వందల కోట్లు సంపాదిస్తున్న అక్షయ్‌ పాతిక కోట్లు ఇస్తే తర్వాత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా.

పదుల సంఖ్యలో కమర్షియల్‌.. ఏడాదికి రెండు మూడు సినిమాలు.. వెబ్‌ సిరీస్‌లు చేస్తున్న అక్షయ్‌ పాతిక కోట్లు ఇవ్వడం చాలా తక్కువే. దాన్ని కూడా మీరు ఇలా పబ్లిసిటీ కోసం గొప్పగా చెప్పుకోవడం ఏమాత్రం బాగాలేదు ట్వింకిల్‌ జీ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ కామెంట్స్‌ కు చాలా మంది నిజమే కదా అక్షయ్‌ స్థాయికి పాతిక కోట్లు పెద్ద లెక్క కాదు. ఫోర్బ్స్‌ లో నెం.1 స్థానంలో నిలిచిన ఆయన ఒక్కో సినిమాకు 50 నుండి 75 కోట్లు తీసుకునే ఆయన పాతిక కోట్లు ఇవ్వడం దాన్ని ఆలోచించుకో మంటూ ట్వింకిల్‌ అనడం విడ్డూరంగా ఉంది అంటున్నారు.