Begin typing your search above and press return to search.
తల తీస్తానంటున్న ప్రముఖ హీరో వైఫ్
By: Tupaki Desk | 21 March 2017 11:14 AM GMTవివాదాస్పద అంశాలు.. తమకే మాత్రం సంబంధం లేని అంశాల విషయాల్లో అస్సలు తలదూర్చేవారు కాదు సెలబ్రిటీలు. ఇక.. సినిమా సెలబ్రిటీలు సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. వివాదాస్పద అంశాల్ని ప్రస్తావిస్తే.. మాకెందుకీ గోల.. సినిమా విషయాల మీద మాట్లాడతాం అనే వారు కూడా. ఇప్పుడు కాలం మారిపోయింది. సామాజిక అంశాల మీదా.. బర్నింగ్ టాపిక్స్ మీద ఓపెన్‌గా మాట్లాడటమే కాదు.. తమ అభిప్రాయాల్ని చాలా సూటిగా చెప్పుస్తున్నారు. తాజాగా అలాంటి మాటనే చెప్పి వార్తల్లోకి వచ్చారు నాటి అందాల భామ ట్వింకిల్ ఖన్నా.
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ను పెళ్లాడిన ట్వింకిల్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. పెళ్లి తర్వాత.. సినిమాలకు దూరమైన ఆమె ఇంటీరియర్ ఫ్యాషన్ డిజైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. తాజాగా ఆమె ఒక అంశంపై తీవ్రంగా స్పందించారు. ఈ మధ్యన టీవీఎఫ్ సీఈవో అరునబ్ కుమార్ తీరు వివాదాస్పదం కావటం తెలిసిందే.
తన కంపెనీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటమే కాదు.. దానిపై రచ్చ జరిగితే.. నిస్సిగ్గుగా సమర్థించుకున్న వైనం కనిపిస్తుంది. తాను ఒంటరినని.. తనకు ఎవరైనా అమ్మాయి అందంగా కనిపిస్తే.. మీరు సెక్సీగా ఉన్నారని పొగుడుతానని.. అదేమైనా తప్పా? అంటూ తన తీరు ఎలా ఉంటుందన్నది చెప్పేశాడు. ఆయన వ్యాఖ్యల్ని పలువురు తప్పు పట్టారు.
తాజాగా ట్వింకిల్ ఖన్నా.. ఒక ప్రముఖ మీడియా సంస్థ బ్లాగ్ కు రాసిన వ్యాసంలో ఈ అంశాన్ని ప్రస్తావించి.. అరునబ్ తీరును తీవ్రంగా తప్పుపట్టి కఠిన వ్యాఖ్యలు చేశారు.
పడక గదిలో సన్నిహితంగా ఉండే మహిళతో.. నువ్వు సెక్సీగా ఉన్నావని చెప్పొచ్చని.. కానీ పని చేసే ఉద్యోగినితో సెక్సీ వ్యాఖ్యలు ఏ మాత్రం సరికావన్నారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని లేనిపక్షంలో.. తల తీయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆమె కామెంట్ పైన.. ట్వింకిల్ భర్త అక్షయ్ స్పందిస్తూ.. తనకన్నా తన సతీమణి చాలా స్ట్రాంగ్ అంటూ కీర్తించారు. ట్వింకిల్ వ్యాఖ్యల్ని ఇప్పుడు పలువురు మద్దతు పలుకుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/