Begin typing your search above and press return to search.

టాయిలెట్ సీక్వెల్.. ట్వింకిల్ ఇరగదీసింది

By:  Tupaki Desk   |   20 Aug 2017 6:12 AM GMT
టాయిలెట్ సీక్వెల్.. ట్వింకిల్ ఇరగదీసింది
X
నిజంగానే భారతదేశం ఎంత అభివృద్ది చెందినా కూడా.. ఇంకా బహిరంగంగా భహిర్భూమికి వెళ్లడం అనేది మన దురదృష్టం. ఇంకా చాలామంది ఇళ్లలో టాయిలెట్లు లేవు. చాలామంది ఆరుబయట మలవిసర్జన చేయడానికి అలవాటుపడుతూనే ఉన్నారు. అంతెందుకు.. ముంబాయ్ స్లమ్ ఏరియల్లో నివసించేవారు కూడా.. చక్కగా అలా బీచ్ ఒడ్డున చల్లగాలికి మల విసర్జన చేయడానికి సిద్దపడుతున్నారు తెలుసా?

ప్రస్తుతం ఇదే అంశాన్ని టచ్ చేస్తూ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 'టాయిలెట్' అంటూ ఒక సినిమాను తీశాడు. ఈ సినిమాలో తన ఇంట్లో టాయిలెట్ లేదని అప్పుడే అత్తారింటికి వచ్చిన ఒక కోడలు.. మొగుడ్ని అత్తారింటినీ వదిలేసి వెళిపోతుంది. అప్పుడు ఆ యువకుడు ఎలా తన ప్రేమని దక్కించుకోవడానికి ఆ ఊళ్ళో టాయిలెట్లు కట్టాడనేదే సినిమా. ఈ సినిమాను అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా రూపొందించింది. మ్యాటర్ ఏంటంటే.. సరదాగా ట్వింకిల్ పొద్దున్నే ముంబాయ్ బీచ్ లో జాగింగ్ కు వెళితే.. అక్కడ ఒకతను ఇలా పబ్లిక్ లో టాయిలెట్ కార్యక్రమాన్ని కానిచ్చేస్తున్నాడు. దానిని వెంటనే సెల్ఫీ తీసి.. టాయిలెట్ 2.0 సినిమా.. ఆ సీక్వెల్ లో తొలిసీన్ ఇదే.. అంటూ పోస్ట్ చేసింది.

కొంతమంది నెటిజన్లు ఛీ ఛీ కొత్త సినిమాను ఇలా ప్రమోట్ చేసుకుంటున్నావా అని తిడుతుంటే.. కొంతమంది మాత్రం.. ముంబయ్ వంటి నగరంలో కూడా ఇలాంటి దయనీయ స్థితి ఉందంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా ట్వింకిల్ పోస్టు మాత్రం ఇరగదీసిందనే చెప్పాలి.