Begin typing your search above and press return to search.

బాబోయ్‌ భర్తతోనా.. నా వల్ల కాదు

By:  Tupaki Desk   |   28 Sep 2019 1:30 AM GMT
బాబోయ్‌ భర్తతోనా.. నా వల్ల కాదు
X
ప్రస్తుతం బాలీవుడ్‌ లో అత్యధిక సంపాదన కలిగి ఉన్న హీరో అక్షయ్‌ కుమార్‌. ఖాన్స్‌ త్రయంను పక్కకు నెట్టి అక్షయ్‌ ఈ రికార్డును దక్కించుకున్నాడు. సంవత్సరంలో రెండు మూడు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటున్న అక్షయ్‌ బుల్లి తెరపై.. ఇంకా వెబ్‌ సిరీస్‌ లను కూడా వదలకుండా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉన్నాడు. అక్షయ్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా కూడా హీరోయిన్‌ గా ప్రయత్నించింది. కాని ఆమెకు ఆశించిన స్థాయిలో స్టార్‌ డం రాలేదు. అక్షయ్‌ కుమార్‌ భార్యగానే ఆమెకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది.

ట్వింకిల్‌ ఖన్నా నటిగా రాణించలేక పోయినా కూడా రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు డిజిటల్‌ పోర్టల్‌ కోసం ఒక కంటెంట్‌ షో ను ప్రారంభించింది. ఈ షోలో 25 నుండి 55 సంవత్సరాల మహిళలు తమ సమస్యలు చెప్పుకుంటూ వాటికి పరిష్కారం పొందవచ్చు. ఈ షోకు సంబంధించిన ప్రమోషన్‌ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఎంతో మందిని డైరెక్ట్‌ చేస్తున్న మీరు మీ వారిని ఎప్పుడు డైరెక్ట్‌ చేస్తారంటూ ప్రశ్నించడం జరిగింది.

ఆ ప్రశ్నకు ట్వింకిల్‌ ఖన్నా స్పందిస్తూ.. ఇంట్లో ఆయన్ను డైరెక్ట్‌ చేస్తూనే ఉంటాను. ఆయన్ను ఇంట్లోనే కంట్రోల్‌ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాను. అలాంటిది ఆయన్ను రీల్‌ లైఫ్‌ లో కూడా డైరెక్ట్‌ చేయడం అంటే నా వల్ల కాదంది. భవిష్యత్తులో కూడా భర్తను డైరెక్ట్‌ చేసే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది. తెలుగులో 'శీను' చిత్రంలో వెంకటేష్‌ తో నటించిన ఈమె ఆ తర్వాత మళ్లీ సౌత్‌ లో కనిపించలేదు. బాలీవుడ్‌ కే పరిమితం అయ్యింది. అక్కడ కూడా ఈమెకు సక్సెస్‌ దక్కలేదు. కొంత కాలానికే హీరోయిన్‌ కెరీర్‌ కు గుడ్‌ బై చెప్పింది.