Begin typing your search above and press return to search.
బాలీవుడ్ హీరో అక్షయ్ ని 'గే' అన్నది ఎవరు...?
By: Tupaki Desk | 12 May 2020 5:47 AM GMTబాలీవుడ్ అన్యోన్యమైన దంపతులు అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నాలు ఇక్కడి వాళ్లకు కూడా పరిచయమే. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'శీను' సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు వారికీ దగ్గరైంది ట్వింకిల్ ఖన్నా. అలానే బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ తన సినిమాలతో సౌత్ ప్రేక్షకులను కూడా అలరిస్తూ వస్తున్నాడు. ఈ బాలీవుడ్ జంట కలిసి 'ఇంటర్నేషనల్ ఖిలాడీ' 'జుల్మి' చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అలనాటి హీరోయిన్ డింపుల్ కపాడియా కూతురైన ట్వింకిల్ ఖన్నా.. అక్షయ్ తో కొన్నేళ్లు ప్రేమాయణం సాగించి 2001లో వివాహం చేసుకుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఆరవ్ - నీతారా కలిగారు. అయితే వీరి వివాహానికి ముందు చోటు చేసుకున్న కొన్ని విషయాలను ట్వింకిల్ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ సందర్భంగా వీరిద్దరి పెళ్లి ప్రస్తావన గురించి చర్చకు వచ్చినప్పుడు డింపుల్ కపాడియా అక్షయ్ గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. వీరి పెళ్లి ప్రస్తావన వచ్చినపుడు ఆమె తల్లి డింపుల్ కపాడియా.. అక్షయ్ కుమార్ ఒక 'గే' అని ట్వింకిల్ ఖన్నాతో చెప్పిందట. ఈ విషయాన్ని స్వయంగా ట్వింకిల్ ఖన్నానే బయటకు వెల్లడించింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ''నేను అక్షయ్.. మా పెళ్లి గురించి మా అమ్మ దగ్గర ప్రస్తావించాము. అక్షయ్ వెళ్లిపోయిన తర్వాత నాకు ఓ మాట చెప్పాలని మా అమ్మ అంది. నేను వెంటనే చెప్పమని మారాం చెయ్యగా.. అక్షయ్ గే అని ఆమె ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందని అమ్మ చెప్పింది. ఆ మాటతో నాకు మూర్ఛపోయినంత పనైంది'' అని ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత డింపుల్ కపాడియా.. వీరిద్దరూ వన్ ఇయర్ డేటింగ్ చేయాలన్న కండీషన్ పెట్టిందట. అలా సహజీవనం చేసిన సంవత్సరం తర్వాత 2001లో వారిద్దరి వివాహం జరిగింది. భర్తకి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఆదర్శ గృహిణి అనిపించుకుంది ట్వింకిల్. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అక్షయ్ - ట్వింకిల్ పిల్లలతో విలువైన సమయాన్ని గడుపుతున్నారు. ఇదిలా ఉండగా దేశంలో విపత్కర పరిస్థుతులు ఎదుర్కుంటున్న సమయంలో మరెవరూ చేయలేని విధంగా ఆర్థిక సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు అక్షయ్. కరోనా పై పోరాటానికి ఇప్పటి దాకా అక్షయ్ 30 కోట్ల రూపాయల విరాళం అందించాడు. పీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 కోట్లు.. ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కు రూ.3 కోట్లు.. ముంబై పోలీస్ ఫౌండేషన్ కు రూ.2 కోట్లు విరాళంగా అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు.