Begin typing your search above and press return to search.

మద్రాస్ హైకోర్టులో ధ‌నుష్ -ఐశ్వ‌ర్య‌పై కేసులో ట్విస్టు

By:  Tupaki Desk   |   11 July 2023 10:54 PM GMT
మద్రాస్ హైకోర్టులో ధ‌నుష్ -ఐశ్వ‌ర్య‌పై కేసులో ట్విస్టు
X
త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ - ఐశ్వ‌ర్య జంట దాదాపు 18ఏళ్ల కాపురం అనంత‌రం విడాకులు తీసుకోవ‌డం అభిమానుల‌ను క‌ల‌చివేసిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇక ఈ దంప‌తుల‌పై ఒకానొక స‌మ‌యంలో న‌మోదైన కేసు మ‌ద్రాస్ హైకోర్టులో చాలా కాలంగా విచార‌ణ‌లో ఉంది. తాజాగా ఈ కేసును హైకోర్ట్ కొట్టివేసింది. కేసు పూర్వాప‌రాల్లోకి వెళితే...

కొన్నేళ్ల క్రితం 'వెళ్లై ఇల్లా పట్టాధారి' (ర‌ఘువ‌ర‌న్ బిటెక్) చిత్రంతో ధ‌నుష్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో ఓ స‌న్నివేశంపై తీవ్ర దుమారం చెల‌రేగింది. ఓ సీన్ లో ధూమపానాన్ని ప్రోత్సహించినందుకు హీరో ధనుష్ పై వెంటనే చర్య తీసుకోవాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది. సినిమా సన్నివేశంలో చట్టాన్ని ఉల్లంఘించినందున కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన మద్రాస్ హైకోర్టు జూలై 10న ఫిర్యాదును కొట్టివేసింది. COPTA 2003లోని సెక్షన్ 5 ప్రకారం ఇది నేరం కాదని కోర్టు పేర్కొంది. నటుడు ధనుష్ కి చెందిన న్యాయవాది ఆ సన్నివేశం సీక్వెన్స్ క్ర‌మం (వ‌రుస క్ర‌మం)లో సంద‌ర్భానుసారం వ‌చ్చేద‌ని సెన్సార్ బోర్డు నియమాలను అనుసరించి తెర‌కెక్కించిన‌దేనని వాదించారు. ఆయ‌న వాద‌న కోర్టులో నెగ్గింది. 'వెళై ఇల్లా పట్టాధారి'లో అమ‌లాపాల్ క‌థానాయిక‌. ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజనీకాంత్ నిర్మించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో న‌టిస్తున్న 'కెప్టెన్ మిల్లర్' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ధ‌నుష్- ప్రియాంక అరుల్ మోహన్ - శివ రాజ్ కుమార్ త‌దిత‌రులు పాత్రలు పోషించారు. త‌దుప‌రి తాత్కాలికంగా D 50 అనే టైటిల్ తో త‌దుప‌రి చిత్రం ప్రారంభమైంది.

ఈ చిత్రం కేవలం రెండు రోజుల క్రితం సెట్స్ పైకి వెళ్లింది. టాలీవుడ్ దర్శ‌కుడు శేఖర్ కమ్ములతో త్రిభాషా చిత్రం .. వెట్రిమారన్ తో 'వడ చెన్నై 2'లోను ధనుష్ న‌టిస్తున్నారు. ఇది కాకుండా సెల్వరాఘవన్ తో 'ఆయిరతిల్ ఒరువన్ 2'లోను న‌టిస్తున్నాడు. నెల్సన్ దిలీప్‌కుమార్‌తో కొత్త చిత్రానికి సంత‌కం చేశార‌ని తెలిసింది.