Begin typing your search above and press return to search.

వెంకీమామ: ఆ ట్విస్ట్ బయటపెట్టారే!

By:  Tupaki Desk   |   8 Dec 2019 10:01 AM GMT
వెంకీమామ: ఆ ట్విస్ట్ బయటపెట్టారే!
X
విక్టరీ వెంకటేష్.. అక్కినేని నాగచైతన్య నటించిన మల్టిస్టారర్ చిత్రం 'వెంకీమామ' డిసెంబర్ 13 న విడుదల కానుంది. నిజ జీవితంలో మామ మేనల్లుడు అయిన వెంకీ చైతులు ఇద్దరూ సినిమాలో కూడా అదే పాత్రలు పోషిస్తూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఉంది. ఇదిలా ఉంటే 'వెంకీమామ' సినిమాలో ఇక పెద్ద ట్విస్ట్ ఈమధ్య ఆన్ లైన్ లో లీక్ అయింది.

ఏ సినిమా అయినా విడుదలకు ముందే టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ అయిన బుక్ మై షో లాంటి వాటిలో సినిమా వివరాలు ఉంచుతారు. ఎడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ ప్రారంభం కంటే ముందే ఇది జరుగుతుంది. 'వెంకీమామ' లో ఏం జరిగిందంటే బుక్ మై షో లో 'సినాప్సిస్' ఉండే చోట సినిమా కథ చెప్పారు. అందులో ఇప్పటివరకూ ప్రేక్షకులకు తెలియని ఒక ట్విస్ట్ కూడా వెల్లడించారు. సినిమాలో ఇలాంటి ట్విస్టులను నిజానికి లీక్ చేయకూడదు. చివరికి రివ్యూయర్లు కూడా అలాంటి ముఖ్యమైన ట్విస్టులను తమ రివ్యూలలో ప్రస్తావించరు. కానీ ఎపుడైతే ఈ ట్విస్ట్ రివీల్ అయిందో సోషల్ మీడియాలో ఇదో హాట్ టాపిక్ గా మారింది. అయితే సినిమా విడుదలకు ముందే అది వెల్లడించడం భావ్యం కాదు కాబట్టి ఆ ట్విస్ట్ గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు.

ఏదేమైనా అలా కథలోని కీలక పాయింట్ బయటకు వచ్చినంతమాత్రాన ప్రేక్షకులకు సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గదు అనేదానికి గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. వెంకీ.. చైతు ఇద్దరికీ కుటుంబ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతుందనడంలో ఆశ్చర్యం లేదు. దగ్గుబాటి మామ.. అక్కినేని అల్లుడు అల్లరి ఎలా ఉందో చూడాలంటే మనం డిసెంబర్ 13 వరకూ వేచి చూడాలి.