Begin typing your search above and press return to search.

విజయ్ సేతుపతిపై దాడి ఘటనలో ట్విస్ట్

By:  Tupaki Desk   |   18 Nov 2021 9:45 AM GMT
విజయ్ సేతుపతిపై దాడి ఘటనలో ట్విస్ట్
X
ఇటీవల ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జాతీయ అవార్డును అందుకొని బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్న విజయ్ సేతుపతిపై ఓ ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదే సమయంలో విజయ్ సేతుపతిపై దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ‘హిందూ వాది’ అర్జున్ సంపత్ పేరిట మక్కల్ కట్చి సంస్థ పేరిట ట్వీట్ చేశారు. విజయ్ సేతుపతిపై దాడి చేసిన వారికి ఒక్కో దెబ్బకు రూ.1001 బహమతి ఇస్తానని అందులో ప్రకటించారు.

కాగా బహిరంగంగా బెదిరింపులకు పాల్పడిన అర్జున్ సంపత్ పై తాజాగా కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కాగా ప్రముఖ స్వాతంత్య్రోద్యమ వీరుడు అయ్యి తేవర్ ను విజయ్ సేతుపతి అవమానించాడని.. అతడు క్షమాపణలు చెప్పే వరకూ వదిలిపెట్టమని గతంలో అర్జున్ ప్రకటించారు. విజయ్ క్షమాపణలు చెప్పే వరకూ ప్రతి తన్నుకు రూ.1001 రివార్డును అందజేస్తామని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.