Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్.. ట్విస్టుల మీద ట్విస్టులు

By:  Tupaki Desk   |   22 Aug 2019 4:35 PM GMT
రాజ్ తరుణ్.. ట్విస్టుల మీద ట్విస్టులు
X
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్.. కారును వదిలేసి రన్నింగ్ చేసిన వ్యవహారం ఇప్పుడు చిదంబరం అరెస్ట్ తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న వార్త. నార్సింగి వద్ద రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురి కావడం.. కారును వదిలేసి రాజ్ తరుణ్ రన్నింగ్ చేస్తున్న సిసి టీవీ విజువల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి తన వైపు వెర్షన్ వినిపించాడు. ఇదిలా ఉంటే పోలీసులు ఈ విషయంలో తమ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.

అయితే ఈ రోజు ఈ ఎపిసోడ్ మరో కీలక మలుపు తిరిగింది. కార్తీక్ అనే వ్యక్తి ఈ యాక్సిడెంట్ వ్యవహారానికి సంబంధించి మరి కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. కార్తీక్ నివాసానికి సమీపంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందట. కార్తీక్ ఇంటివద్ద నైట్ విజన్ ఉండే సిసిటీవీ కెమెరాలు ఉన్నాయని.. వాటిలో ఈ యాక్సిడెంట్ రికార్డ్ అయిందని తెలిపాడు. యాక్సిడెంట్ సమయంలో రాజ్ తరుణ్ అత్యంత వేగంగా కారును నడుపుతున్నాడని చెప్పాడు. కారు గోడకు గుద్దుకున్న తర్వాత అందులో నుంచి దిగి రాజ్ తరుణ్ పరిగెత్తాడని.. తన బైక్ పై చేజ్ చేసి రాజ్ తరుణ్ తో మాట్లాడడం జరిగిందని తెలిపాడు.. ఈ విషయం అంతా తన ఫోన్ లో రికార్డ్ చేశానని వెల్లడించాడు. ఇదంతా అయిన తర్వాత రాజ్ తరుణ్ ను ఇంటివద్ద దిగబెట్టానని చెప్పాడు. ఆ సమయంలో తన మేనేజర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాడని రాజ్ తరుణ్ చెప్పాడట.

కొన్ని గంటల తర్వాత రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర తనకు కాల్ చేసి ఆ వీడియోను ఇస్తే మూడు లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పాడు. కానీ ఆ తర్వాత జర్నలిస్ట్ అని చెప్తూ ఒక మహిళా చేత కాల్ చేయించి "బ్లాక్ మెయిల్ చేస్తున్నావా" అంటూ తనను బెదిరించాని అన్నాడు. అయితే రాజ్ తరుణ్.. రాజా రవీంద్ర అసలు స్వరూపం బయట పెట్టేందుకు ఇలా బేరసారాలు చేయాల్సి వచ్చిందని చెప్పాడు. వీడియోలు.. తన వద్దనున్న కాల్ రికార్డింగ్స్ అన్నీ పోలీసువారికి అందచేశానని కార్తీక్ వెల్లడించాడు. ఇక యాక్సిడెంట్ సమయంలో రాజ్ తరుణ్ మద్యం సేవించి ఉన్నట్టుగా కూడా కార్తీక్ అంటున్నాడు.

ఓవరాల్ గా ఈ యాక్సిడెంట్ వ్యవహారాన్ని రాజ్ తరుణ్ సున్నితంగా డీల్ చేయకుండా కాంప్లికేట్ చేసుకున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. యాక్సిడెంట్ లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. అలాంటప్పుడు నేరుగా పోలీసులకే సమాచారం అందించి ఉంటే సరిపోయేది. ఒకవేళ మద్యం సేవించి ఉన్నా 'ఫైన్' తోనే సరిపోయేది. అప్పుడు ఈ కార్తీక్ తో చర్చ.. బేరసారాల కథ ఉండేది కాదు. అలా కాకుండా ఇప్పుడు కేసులో బెదిరింపులు కూడా చోటు చేసుకోవడంతో సంక్లిష్టంగా మారిందనే అభిప్రాయలు వెలువడుతున్నాయి.