Begin typing your search above and press return to search.
రాఖీ డేటింగ్ లో ట్విస్టులే ట్విస్టులు.. రీల్ సీన్ కు ఏ మాత్రం తీసిపోదంతే
By: Tupaki Desk | 21 July 2022 9:30 AM GMTబాలీవుడ్ నటీమణులకు కొదవలేకున్నా.. కొందరు మాత్రం మిగిలిన వారికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంటారు.ఆ కోవలోకే వస్తారు రాఖీ సావంత్. శృంగార గీతాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె.. తర్వాత స్వయంవరం పేరుతో నిర్వహించిన రియాల్టీ షోలో ఆమెకు మరింత గుర్తింపును తెచ్చి పెట్టింది. అనంతరం రితేశ్ సింగ్ తో ఆమె పెళ్లి.. తర్వాతి కాలంలో బ్రేకప్.. ఆ వెంటనే బిజినెస్ మెన్ తో లవ్.. ఎంగేజ్ మెంట్.. ఇలా తరచూ వార్తల్లో నిలుస్తోంది రాఖీ సావంత్.
పద్నాలుగు గంటల వ్యవధిలో ఆమెకు సంబంధించిన డేటింగ్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో అందరి చూపు పడేలా చేయటమే కాదు.. చివరకు సినిమాటిక్ సీన్లతో చోటు చేసుకున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ జరిగిందేమంటే.. రాఖీ కంటే ఆరేళ్లు చిన్నోడైన అదిల్ దురానీతో ప్రేమలో పడటం.. వారిద్దరూ కొత్తగా జీవితాన్ని షురూ చేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. అతడ్ని కలిసేందుకుఢిల్లీకి వెళ్లిన ఆమె.. అతడి కోసం అక్కడ వెయిట్ చేసి.. అతను రాకపోవటంతో.. రెండు గంటల పాటు ఏడ్చినట్లుగా ముంబయి ఎయిర్ పోర్టులో సినిమా రిపోర్టర్లతో తన ఆవేదనను పంచుకుంది.
ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన రాఖీని చూసినంతనే కెమేరామెన్లు తమ కెమేరాలకు పని చెప్పగా.. ఎందుకు దిగులుగా ఉన్నారని అడగటం.. బాయ్ ఫ్రెండ్ అదిల్ ను కలిసేందుకు ఢిల్లీకి వెళితే.. అతడు కలవలేదని చెప్పింది. అతడ్ని కలిసేందుకే తానుఇలా రెఢీ అయి వెళ్లానని.. కలవటానికి రాలేదని.. అందుకే తిరిగి వచ్చేసినట్లు చెప్పింది. తామిద్దరం ఢిల్లీ నుంచి కలిసి రావాల్సి ఉందని.. అతను రాకపోవటంతో వెయిట్ చేస్తూ ఉండిపోయానని.. ఫ్లైట్ లో రెండు గంటలు ఏడవటంతో తన కాటుక చెరిగిపోయిందని చెప్పింది.
అతడికి వీడియో కాల్ చేయొచ్చు కదా? అని అక్కడున్న ఫోటోగ్రాఫర్ సూచన చేస్తే.. తాను చేయనని.. తనకు ఆత్మగౌరవం ఎక్కువని పేర్కొంది. ఈ వీడియోను ఒక ఫోటోజర్నలిస్టు పోస్టు చేయటంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. కొద్ది గంటల తర్వాత.. అదిల్ ముంబయి ఎయిర్ పోర్టుకు రావటం.. అతని కోసం పూల బొకేను తీసుకొచ్చి.. ఎయిర్ పోర్టు బయటకు వచ్చినంతనే అతడి మీద పూలు పోసేసి.. తన ప్రేమను వ్యక్తం చేసింది రాఖీ.
ఆ సందర్భంగా ఆమె కాసింత ఎమోషనల్ కావటం.. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రాఖీ డేటింగ్ ఏమో కానీ.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న ట్విస్టులు మాత్రం.. రీల్ సీన్లకు ఏ మాత్రం తీసిపోనివిగా ఉన్నాయని చెప్పక తప్పదు.