Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాలో మారు మ్రోగుతున్న రియల్ హీరో
By: Tupaki Desk | 30 July 2020 9:50 AM GMTగత రెండు మూడు నెలలుగా రియల్ హీరో అంటూ కీర్తించబడుతున్న వ్యక్తి ఎవరు అంటే ప్రతి ఒక్కరు ఠక్కున చెప్పే పేరు సోనూసూద్. ఇండియా మొత్తం కూడా ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగి పోతుంది. గల్లీ మీడియా నుండి జాతీయ మీడియా వరకు మరియు సోషల్ మీడియా నుండి చిల్లర ముచ్చట్ల వరకు ఎక్కడ చూసినా కూడా సోనూసూద్ గురించే చర్చ జరుగుతుంది. నేడు సోనూసూద్ బర్త్ డే అవ్వడంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మరియు రియల్ హీరో అనే హ్యాష్ ట్యాగ్ దద్దరిల్లి పోయేలా ట్రెండ్ అవుతున్నాయి.
లాక్ డౌన్ సమయంలో దాదాపుగా 30 వేల మంది వలస కార్మికులను బస్సులు రైళ్లు మాత్రమే కాకుండా ఏకంగా విమానం ద్వారా కూడా వారి వారి గమ్యస్థానాలకు చేర్చాడు. ఆ తర్వాత కూడా ఆయన సాయం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడో విదేశాల్లో ఉన్న తెలుగు డాక్టర్ విద్యార్థులను ఇండియాకు రప్పించడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు. ఇక ఇటీవల ఆయన రైతుకు ట్రాక్టర్ ను పంపించడం.. కూరగాలు అమ్ముకుంటున్న సాఫ్ట్ వేర్ అమ్మాయికి సాయం చేయడం.. కర్రసాము బామ్మకు స్కూల్ ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సాయం చేయడం వంటివి చేయడంతో మరింతగా పాపులారిటీ సాధించాడు.
సాయం కావాల్సిన వారు ఎవరైనా తనను సంప్రదించవచ్చు అంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా సోనూసూద్ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో సోనూసూద్ బర్త్ డే రావడంతో నెట్టింట ఆయన పేరు మారుమ్రోగిపోతుంది. వాట్సప్ స్టేటస్ ల నుండి మొదలుకుని ఇన్ స్టాగ్రామ్ స్టోరీల వరకు ఎక్కడ చూసినా కూడా సోనూసూద్ కనిపిస్తున్నాడు. ప్రతి చోట కూడా రియల్ హీరో అంటున్నారు. జనాలు సోనూసూద్ ను ఇకపై సినిమాల్లో కూడా విలన్ గా చూసేందుకు ఇష్టపడరేమో అన్నట్లుగా పరిస్థితి మారింది. సోనూసూద్ ను రియల్ హీరో అంటూనే ఇకపై ఆయన హీరోగా సినిమాలు చేయాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు.