Begin typing your search above and press return to search.
హీరో కూతురిని రేప్ చేస్తానని.. ఇప్పుడేమో సింపుల్ గా సారీ అనేశాడు!
By: Tupaki Desk | 27 Oct 2020 5:45 AM GMTతమిళ హీరో.. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి క్రేజు గురించి తెలిసినదే. బ్యాక్ టు బ్యాక్ బయోపిక్ లలో నటిస్తూ అతడు ఇటీవల అగ్గి రాజేశాడు. శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా `800` పేరుతో రూపొందనున్న చిత్రంలో నటించడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ తో పాటు విజయ్ సేతుపతికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచే ఈ మూవీపై వివాదం మొదలైంది.
తమిళులని శత్రువులుగా చూసే శ్రీలంకకు చెందిన వ్యక్తి బయోపిక్ లో ఎలా నటిస్తావని విజయ్ సేతుపతిపై విమర్శల వర్షం కురవడం మొదలైంది. తమిళ దర్శకులు భారతీరాజా..., చేరన్ కూడా విజయ్ సేతుపతి ఈ మూవీ నుంచి తప్పుకోవాలంటూ విమర్శలు గుప్పించారు. ఓ నెటిజన్ రితిక్ రాజ్ హద్దులు దాటి విజయ్ సేతుపతి ఈ మూవీ నుంచి తప్పుకోకపోతే అతని కూతుర్ని రేప్ చేస్తామంటూ వీరంగం ఆడాడు.
అతని ట్వీట్ కి షాకైన నెటిజనులు రితిక్ ని ఉరితీయాలని డిమాండ్ చేశారు. దీంతో తను చేసిన తప్పుకు రియలైజ్ అయిన రితిక్ తను కోవిడ్ కారణంగా జాబ్ పోగొట్టుకున్న టెన్షన్ లో అలా తిట్టేశానని,... ఇప్పటి వరకు తను ఎవరితోనూ అసభ్యంగా ప్రవర్తించలేదని..., తన తొందర పాటుని ఓ సోదరుడిలా గమనించి క్షమించమని విజయ్ సేతుపతిని కోరాడు. జీవితంలో ఇలాంటి ట్వీట్ లు తను చేయనని స్పష్టం చేశాడు. దీంతో విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కి మంట తగ్గింది.. అయితే అతగాడు కూతురుని రేప్ చేస్తానని వార్నింగ్ ఇచ్చి ఇంతలోనే సింపుల్ గా సారీ చెప్పేయడంపై అభిమానుల్లో గుర్రు ఇంకా తగ్గలేదట.