Begin typing your search above and press return to search.

​ఆమెపై మనవాళ్లు కక్ష కట్టేశారే

By:  Tupaki Desk   |   29 July 2017 7:09 AM GMT
​ఆమెపై మనవాళ్లు కక్ష కట్టేశారే
X
బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్తున్నా హీరోయిన్లు ఈ మధ్య పెరుగుతూనే ఉన్నారు కానీ ప్రియాంక చోప్రా అంతగా ఎవరు పాపులర్ కాలేక పోయారు. ఆమెకన్నా ముందు కొంతమంది కొన్ని ఇంటర్నేషనల్ సినిమాలలో నటించినా అవి అన్నీ ఆర్ట్ ఫిల్మ్ హౌస్ కి చెందినివి. ప్రియాంక అక్కడకు వెళ్ళటం వెళ్ళటమే యాక్షన్ సెక్సీ సినిమాలు చేసి అందరిని తన అందాలుతో ఆకట్టుకుంది.

అయితే ప్రియాంక హాలీవుడ్ కి వెళ్ళినప్పటి నుంచి ఆమె పై విమర్శలు పెరుగుతూ వచ్చాయి. ఇక్కడ ఉన్నప్పుడూ కూడా ఆమె ఏమి పద్దతి గల సినిమాలు చేయలేదు. పక్క కమర్షియల్ సినిమాలే చేసింది. అప్పుడప్పుడూ ఆమెలో నటిని బయటపెడుతూ ఉండేది. తన నటనను మెరుగుపరుచుకునే క్రమంలో టాప్ హీరోయిన్ గా, మంచి నటిగా అరుదైన గుర్తుంపు తెచ్చుకుంది. కాకపోతే ఇప్పుడు ప్రియాంక సోషల్ మీడియాలో ఏమి పోస్ట్ చేసిన ఆమె పై విమర్శలు తప్ప మెచ్చుకోవడం అంటూ చేయటం లేదు మన వాళ్ళు. ఆమె ఏ డ్రెస్స్ వేసుకొన్నా ఎక్కడుకు వెళ్లినా లేదా ఒక సెల్ఫి పెట్టినా అన్నింటి పైనా కామెంట్లు కుమ్మరిస్తున్నారు. ఇప్పుడు కూడా తెల్ల విగ్గు పెట్టుకొని ఎర్ర గౌన్ వేసుకొన్న ఒక ఫోటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇది 2015లో ప్రియాంక హాలీవుడ్‌ లో అమెరికన్‌ టీవీ సీరస్‌ ‘క్వాంటికో’లో నటిస్తున్నప్పుడు తీసిన ఫొటో. ఇప్పుడు ఈ ఫోటో పై మన వాళ్ళు కామెంట్లు ఏంటి అనుకున్నారు ప్రియాంక చూడటానికి వేల కోట్ల అక్రమ ఆస్తులతో దొంగ మాతగా వార్తల్లోకెక్కిన రాధేమా తరహాలో ఉంది అని కామెంట్లు చేస్తున్నారు.

కొద్ది కాలం కిందట రాధేమా తన ఎర్ర డ్రెస్ వేసుకొని కనిపించిన ఫోటో న్యూస్ లో బాగా పాపులర్ లెండి. ఆమె నగలు ఎర్ర చీర ఆమె ట్రేడ్ మార్క్ లాంటిది. ఇప్పుడు ప్రియాంక ఫోటోలో కూడా ఎర్ర గౌన్ వేసుకోవడం తో మనవాళ్లు ప్రియాంక ను రాధేమాతో పోల్చి హేళన చేస్తున్నారు. ఇప్పుడు ఈ బాలీవుడ్ సుందరి హాలీవుడ్లో ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్‌’, ‘ఈజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ చిత్రాల్లో నటిస్తోంది.​