Begin typing your search above and press return to search.

ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు బ్యూటీ క్వీన్స్

By:  Tupaki Desk   |   8 May 2019 7:34 AM GMT
ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు బ్యూటీ క్వీన్స్
X
హీరోయిన్లుగా పట్టుమని పది అవకాశాలు దక్కించుకోవడమే ఒక ఛాలెంజ్. అలాంటిది ఈ జెనరేషన్ లో పదేళ్ళకు పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన హీరోయిన్లు కాజల్ అగర్వాల్.. తమన్నా భాటియా. పదేళ్ళు ఏం ఖర్మ ఇప్పటికే ఇద్దరూ ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయినట్టుంది. అయినా చెక్కుచెదరని గ్లామర్ ను మెయిన్టెయిన్ చెయ్యడమే కాకుండా క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

తాజాగా ఈ భామలు ఇద్దరూ కలిసి ముంబైలో దర్శనమిచ్చారు. ప్రస్తుతం వీరిద్ధరూ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'క్వీన్' సౌత్ రీమేక్ చిత్రాలలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ 'క్వీన్' తమిళ రీమేక్ టైటిల్ 'ప్యారిస్ ప్యారిస్'. తమన్నా నటించే తెలుగు రీమేక్ 'దట్ ఈజ్ మహాలక్ష్మి'. ఈ సినిమాలు రెండూ రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. దీంతో ఇద్దరూ రిలీజ్ గురించి చర్చించేందుకు ముంబైలో ఒక చోట సమావేశమయ్యారట. ఆ సమయంలో తీసిన ఫోటోలే ఇవి. ఎంతో చక్కగా ఇద్దరూ కలిసి ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని మరీ పోజులు ఇచ్చారు కదా?

కాజల్ ఈ ఫోటోలో స్లీవ్ లెస్ డెనిమ్ గౌన్ వేసుకుంది. తమన్నా మాత్రం బ్లాక్ కలర్ గౌన్లో కనిపించింది. ఇద్దరూ ఇలా సింపుల్ గా ఉండే డ్రెస్సులు ధరించి.. ఇతర యాక్సెసరీస్ ఏవీ లేకుండా.. హెయిర్ ను లూజ్ గా వదిలేసి అందంగా కనిపించారు. ఇద్దరూ మినిమమ్ మేకప్ తో కనిపించడం విశేషం. ఇక వారి నవ్వులు చూస్తుంటేనే ఇద్దరి మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందనేది మనకు అర్థం అవుతుంది. ఒక ఫ్రేమ్ లో ఒక అందాన్నే తట్టుకోలేరు అమాయకపు మగ నెటిజనులు.. ఇక్కడేమో ఒకవైపు మిల్కీ బ్యూటీ.. మరోవైపు చందమామ. పాపం వారందరూ ఏమైపోతారో!

Photo Source : PinkVilla