Begin typing your search above and press return to search.
అమెజాన్ లో సౌత్ వర్సెస్ నార్త్
By: Tupaki Desk | 9 Feb 2022 2:31 PM GMTఇండియాలో కరోనా కారణంగా 2020 నుండి ఓటీటీ బిజినెస్ అన్యూహంగా పెరిగింది. చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాలను కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లు డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నాయి. ఇండియాలో అమెజాన్ మెజార్టీ ఓటీటీ బిజినెస్ ను సొంతం చేసుకుని టాప్ లో ఉంది. అమెజాన్ తన యొక్క స్థానంను కాపాడుకునేందుకు ప్రతి వారం కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూనే ఉంది. ఎక్కువ శాతం ఉత్తరాది సినిమాలను డైరెక్ట్ రిలీజ్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియో నార్త్ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది. వందల కోట్లు పెట్టుబడులు పెడుతూ ఇక్కడ అక్కడ కూడా భారీ సినిమాలను కొనుగోలు చేస్తుంది. ఈ వారం అమెజాన్ ప్రైమ్ ద్వారా రెండు భారీ క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. రెండు పెద్ద సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా ఒక్క రోజు తేడాతో స్ట్రీమింగ్ కాబోతుండటం హాట్ టాపిక్ గా మారింది.
అమెజాన్ లో ఫిబ్రవరి 10వ తారీకున విక్రమ్ నటించిన 'మహాన్' స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో విక్రమ్ తో పాటు ఆయన తనయుడు ధృవ్ కూడా నటించడంతో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా ను భారీ ఎత్తున థియేటర్ల ద్వారా విడుదల చేస్తారని విక్రమ్ అభిమానులు ఆశించారు. కాని థియేటర్ రిలీజ్ ను కొన్ని కారణాల వల్ల స్కిప్ చేసి సినిమా ను డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పట్ల విక్రమ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా నిర్మాతలు వెనక్కు తగ్గలేదు. తండ్రి కొడుకుల మల్టీ స్టారర్ ఇలా సింపుల్ గా ఓటీటీ ద్వారా విడుదల చేయడం విచారకరం. థియేటర్ రిలీజ్ ఎలాగూ లేదు కనుక ఇక చేసేది లేక డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా దృవ్ ను స్ట్రీమింగ్ చేయడం కోసం రెడీ అయ్యారు.
ఇక హిందీలో తెరకెక్కిన గెహ్రైయాన్ సినిమా ను అమెజాన్ లో ఈనెల 11న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీపిక పదుకునే మరియు అనన్య పాండేలు హీరోయిన్స్ గా సిద్దాంత్ చదుర్వేది హీరోగా రూపొందిన ఈ సినిమా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంది. కారణం ఈ సినిమాలో దీపిక పదుకునే మరియు సిద్దాంత్ ల మద్య ఉండే రొమాంటిక్ సన్నివేశాలు. ఇటీవల విడుదల అయిన ఒక పాటలో ఉన్న రొమాన్స్ పీక్స్ లో ఉంది. దీపిక పదుకునే పెళ్లి తర్వాత ఈ స్థాయిలో మరో హీరోతో రొమాన్స్ చేయడం ఇదే ప్రథమం అంటూ చర్చ జరుగుతోంది. ఇదే స మయంలో సినిమా ను కొన్ని వివాదాలు కూడా వెంటాడుతూ సినిమా వార్తల్లో నిలిచేలా చేసింది అనడంలో సందేహం లేదు. అందుకే గెహ్రైయాన్ సినిమా ను హిందీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు.
ఇలా రెండు క్రేజీ సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో స్ట్రీమింగ్ అవ్వడం.. అవి కూడా ఒకటి నార్త్ సినిమా మరోటి సౌత్ సినిమా అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు సినిమాలకు అమెజాన్ లో ఒకదానితో ఒకటి పోటీ అన్నట్లుగా సాగబోతుంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి. అమెజాన్ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్ టైన్ మెంట్ ఖాయం. ఫుల్ పైసా వసూళ్ సినిమాలు రాబోతున్న నేపథ్యంలో ఈ వీకెండ్ ను అమెజాన్ ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేసేయవచ్చు అని ఎదురు చూస్తున్నారు. పోటీ ఉన్నా రెండు సినిమాలు కూడా మంచి ఎంటర్ టైన్మెంట్ ను ఇవ్వడం ఖాయం అంటున్నారు.