Begin typing your search above and press return to search.
రంగ స్థలం రెండు క్లైమాక్స్ లా?
By: Tupaki Desk | 27 Sep 2017 3:37 PM GMTరామ్ చరణ్ లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985కోసం మెగా ఫ్యాన్స్ మహా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. మెగా హీరోల నుంచి రాబోతోన్న నెక్ట్స్ మూవీస్ లో ఒకటి పవన్ కళ్యాణ్ సినిమా అయితే.. రెండోది రామ్ చరణ్ మూవీ రంగస్థలం. పవన్ మూవీ రిలీజ్ పై ఇప్పటికే క్లారిటీ వచ్చేసినా.. రంగస్థలం విషయంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదు.
మొదటగా గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేసిన వరకూ అప్ డేట్స్ బాగానే తెలిశాయి. ఆ తర్వాత హైద్రాబాద్ లో ఆయా గ్రామాల సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నామని చెబుతున్నారు కానీ.. డీటైల్స్ మాత్రం బయటకు రావడం లేదు. కనీసం సెట్స్ కు సంబంధించిన ఫోటోస్ కూడా లీక్ కావడం లేదు. అయితే.. ఈ చిత్రం విషయంలో సుకుమార్ దగ్గర రెండేసి ఆలోచనలు ఉన్నాయట. ఆ విషయం మూవీ స్టార్టింగ్ లోనే మెగాస్టార్ కు కూడా తెలియచెప్పారట. అందుకే దాదాపుగా ప్రతీ సన్నివేశాన్ని రెండేసి యాంగిల్స్ లో పిక్చరైజ్ చేస్తున్నారనే టాక్ ఇప్పుడు బయల్దేరింది.
పీరియాడిక్ మూవీ కావడంతో రిస్క్ తీసుకునేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేని సుకుమార్.. తన స్టైల్ కు ఏమాత్రం తగ్గకుండానే రెండు క్లైమాక్స్ లు కూడా పిక్చరైజ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. రంగస్థలం మూవీ షూటింగ్ డిలే కావడానికి కూడా ఇదే కారణం అని తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి కాగా.. నవంబర్ నెలాఖరునాటికి మొత్తం షూటింగ్ పూర్తి కానుందని అంటున్నారు. రెండు వెర్షన్స్ ను పూర్తిగా చూసి.. అప్పుడు ఫైనల్ వెర్షన్ ను చిరంజీవి డిసైడ్ చేస్తారని తెలుస్తోంది.