Begin typing your search above and press return to search.
ఒకే నేపథ్యం.. రెండు క్రేజీ మూవీస్?
By: Tupaki Desk | 10 May 2022 5:49 AM GMTఒకే నేపథ్యంలో రెండు చిత్రాలు తెరకెక్కిన సందర్భాలు చాలానే వున్నాయి. అలా తెరకెక్కిన చిత్రాల్లో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ లుగా నిలిచాయి. కొన్ని ఫ్లాప్ లు గా మారాయి. అయితే చాలా కాలంగా సిమిలర్ స్టోరీస్ తో ఏ సినిమా తెరపైకి రాలేదు. కానీ ప్రస్తుతం రెండు క్రేజీ చిత్రాలు మాత్రం ఓకే నేపథ్య కథతో తెరకెక్కుతుండటం ఇప్పడు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండు సినిమాలు కూడా క్రేజీ నటులతో రూపొందుతున్నవే కావడం, వాటి కథా నేపథ్యం కూడా కశ్మీర్ నేపథ్యంలోనే తెరకెక్కుతుండటం ఇప్పడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరున్న దర్శకుడు హను రాఘపూడి. వరుస ఫ్లాపుల తరువాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం `సీత రామం`. `యుద్ధంతో రాసిన ప్రేమకథ` అని క్యాన్షన్. దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్నారు. కథకు కీలకమైన ముస్లీమ్ యువతి పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతోంది. దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. లై, పడి పడి లేచే మనసు వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తరువాత హను రాఘవపూడి చేస్తున్న చిత్రమిది. స్వప్న సినిమా బ్యానర్ సి. అశ్వనీదత్ సమర్పణలో స్పప్నదత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అ చిత్రంపై దర్శకుడు హను రాఘవపూడి భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మూవీతో ఎలాగైన మళ్లీ సక్సెస్ ని సాధించిన ట్రాక్ లోకి రావాలని గట్టి నమ్మకంతో వున్నారు.
ఇదిలా వుంటే సరిగ్గా ఇదే తరహా కథతో విజయ్ దేవరకొండ సినిమా తెరకెక్కుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్ ఓల మొదలైంది. విజయ్ దేవరకొండ, సమంత పాల్గొనగా పలు కీలక ఘట్టాలని చిత్రీకరించారు. హను రాఘవపూడి `సీతా రామం` కథకు విజయ్ దేవరకొండ మూవీ స్టోరీ సిమిలర్ గా వుండటం గమనార్హం. ఈ రెండు చిత్రాలు కూడా కశ్మీర్ నేపథ్యంలో సాగడం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈ రెండు చిత్రాలని తెరకెక్కిస్తున్న ఇద్దరు దర్శకులు కూడా ప్రేమకథా చిత్రాలని తెరకెక్కించడం తో మంచి పట్టున్న వారు. అలాంటి డైరెక్టర్స్ ఒకేసారి సిమిలర్ స్టోరీస్ తో కశ్మీర్ నేపథ్యంలో ప్రేమథా చిత్రాలని తెరకెక్కిస్తుండటం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు చిత్రాల్లో ఏది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్నది తెలియాలంటే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.