Begin typing your search above and press return to search.
కొత్త ట్రెండ్: శతమానం 2 రోజుల ప్రీమియర్స్
By: Tupaki Desk | 12 Jan 2017 6:19 PM GMTటాలీవుడ్ సినిమా లెక్కల్లో.. ఓవర్సీస్ కలెక్షన్స్ ఓ భాగం అయిపోయాయి. మామూలు సినిమాలకు యూఎస్ కలెక్షన్స్ ఒక లెక్క మాత్రమే అయితే.. ప్రెస్టీజియస్ మూవీస్ కి.. ముందు రోజు ప్రదర్శించే ప్రీమియర్స్ ఓ బెంచ్ మార్క్ అయిపోయాయి. ఇండియాలో రిలీజ్ ముందు రోజున ప్రీమియర్స్ వేయడం ఇప్పటివరకూ ఆనవాయితీ. మనకు వాళ్లకు ఉన్న టైమ్ గ్యాప్ ప్రకారం.. ఇక్కడ నూన్ షో పడేందుకు 12 గంటల ముందు అక్కడ సినిమా పడిపోతుంది.
ఈ ట్రెండ్ ను శతమానం భవతి చిత్రంతో మార్చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. ఇప్పటికే రెండు సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పందెం కోళ్లలా పోటీ పడుతుంటే... ఏకంగా రెండు రోజుల పాటు ప్రీమియర్స్ ఫిక్స్ చేశారు. జనవరి12న 14 ఏరియాల్లో ప్రత్యేకంగా ప్రీమియర్స్ వేయనుండగా.. 13న యథావిథిగా అన్ని ఏరియాల్లోనూ ఈ శర్వానంద్ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి.
రెండు రోజుల పాటు ప్రీమియర్స్ అనే కొత్త ట్రెండ్ ను దిల్ రాజు కొత్తగా పరీక్షిస్తున్నాడు. ఇది కానీ క్లిక్ అయిందంటే.. మిగిలిన మూవీస్ కి రూట్ చూపించినట్లే. జనవరి 9న ఈ మూవీ యూనిట్ కోసం వేసిన స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత.. శతమానం భవతిపై అంచనాలు మరింతగా పెరిగిపోవడం విశేషం.