Begin typing your search above and press return to search.
'జయం'కు 20 ఏళ్లు.. నితిన్ ఎమోషనల్ పోస్ట్
By: Tupaki Desk | 14 Jun 2022 6:07 AM GMTప్రతీ హీరో కెరీర్ లో మరపురాని, మర్చిపోలేని సినిమా అంటూ ఒకటి వుంటుంది. అలాంటి సినిమా నితిన్ కెరీర్ లోనూ వుంది అదే 'జయం'. సంచలన దర్శకుడు తేజ తెరకెక్కించారు. ఈ మూవీ విడుదలై నేటికి సరిగ్గా ఇరవై ఏళ్లు. జూన్ 14, 2002 లో విడుదలైన ఈ చిత్రం నితిన్ హీరోగా తెరంగేట్రం చేసిన తొలి చిత్రం. ఈ మూవీతో నితిన్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. చిత్రం మూవీస్ బ్యానర్ పై తేజ స్వీయ దర్శకత్వంలో ఈ మూవీని రూపొందించారు.
చిత్రం, నువ్వు నును వంటి వరుస బ్లాక్ బస్టర్ లతో మంచి ఊపుమీదున్న తేజ ఈ మూవీని ఓ అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించారు. నితిన్ హీరోగా పరిచయమైన ఈ మూవీ ద్వారానే హీరోయిన్ గా సదా పరిచయమైంది. ఇక 'తొలి వలపు' సినిమాతో టి.కృష్ణ తనయుడిగా తెరంగేట్రం చేసిన గోపీచంద్ ఆ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో నటుడిగా తన సత్తాని నిరూపించుకోవాలని 'జయం'లో విలన్ గా రఘు పాత్రలో నటించాడు. అతని పాత్రని తీర్చి దిద్దిన తీరు, ఆహార్యం, డైలాగ్ లు చెప్పిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టకుని గోపీచంద్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.
చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ దర్శకుడిగా తేజకు మంచి పేరుని తెచ్చిపెట్టడమే కాకుండా నిర్మాతగా కూడా భారీ లాభాల్ని అందించింది. ఆర్పీ పట్నాయక్ అందించిన సంగీతం, ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుని సినిమా విజయంలోనూ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ కోసం ఆర్పీ పట్నాయక్ తొలిసారి హెవీ మెటల్ మ్యూజిక్ ని వాడారు. ఈ మూవీ కులశేఖర్ మొత్తం 12 పాటలు రాశారు. ప్రతీ పాట బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సినిమాని మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఆడియోగా నిలిచింది.
ఈ మూవీలో సదా చెప్పిన 'వెళ్లవయ్య వెళ్లూ...' అనే డైలాగ్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ డైలాగ్ గా నిలిచింది. గోపీచంద్ రూత్ లెస్ విలన్ గా నటించిన ఈ మూవీలో నితిన్ ఇన్నోసెంట్ గా కనిపించాడు. యూత్ లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ కోసం అప్పట్లో యూత్ భారీగా తరలి వచ్చారు. చాలా మంది టికెట్ లు లభించక వెనుదిరిగి వెళ్లిన సందర్భాలు కూడా అనేకం. ప్రేమకథా చిత్రాల్లో ఈ మూవీ సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసి మ్యూజికల్ లవ్ స్టోరీగా సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
ఈ మూవీ తరువాత 'దిల్'. సై సినిమాలతో సూపర్ హిట్ లని సొంతం చేసుకున్న నితిన్ ఆ తరువాత హిట్ అనే మాట వినడానికి 9 ఏళ్లు పట్టింది. 'ఇష్క్' సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా నితిన్ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ ని పెట్టారు. '20 ఏళ్ల క్రితం జయంతో నా జర్నీ మొదలు పెట్టాను. ఇప్పుడు నాకేం చెప్పాలో మాటలు రావడం లేదు. మొదటగా నన్ను నమ్మి నటుడిగా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మిగతా దర్శకులు, నిర్మాతలు, నటులు, టెక్నీషియన్ లు ఇలా నేను నటించిన సినిమాలకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇన్నేళ్లుగా నన్ను అభిమానిస్తూ, నన్నే ఫాలో అవుతూ చెరగని ప్రేమని అందిస్తున్న అభిమానులకు, వారి ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను' అని ఎమోషనల్ అయ్యారు నితిన్.
ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజక వర్గం'. ఎం.ఎస్. రాజశేఖరరెడ్డి అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.