Begin typing your search above and press return to search.
గాడ్ ఫాదర్... ఆ ఇద్దరు దర్శకుల బ్యాడ్ లక్
By: Tupaki Desk | 10 Oct 2022 5:32 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన గాడ్ ఫాదర్ కి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. తమిళంలో మంచి దర్శకుడిగా ఇప్పటికే పేరు దక్కించుకున్న మోహన్ రాజాకి ఈ సినిమా మరింత మంచి పేరును తెలుగు లో తెచ్చి పెట్టింది అనడంలో సందేహం లేదు.
గాడ్ ఫాదర్ సక్సెస్ అయిన వెంటనే మోహన్ రాజాకి రెండు మూడు సినిమా ఆఫర్లు దక్కాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. నాగార్జునతో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ప్రాజెక్ట్ ను మోహన్ రాజా వెంటనే మొదలు పెట్టబోతున్నాడట. అంతే కాకుండా రామ్ చరణ్ తో కూడా ఒక సినిమాను మోహన్ రాజా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి.
తమిళంతో పాటు తెలుగు లో కూడా మోహన్ రాజా మరింత బిజీ అయ్యేందుకు గాడ్ ఫాదర్ సక్సెస్ కీలకంగా మారబోతుంది. ఇదే సమయంలో గాడ్ ఫాదర్ ను మిస్ అయిన ఇద్దరు దర్శకుల గురించి టాలీవుడ్ లో ప్రముఖంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు దర్శకులు యంగ్ డైరెక్టర్ సుజీత్ కాగా... మరొకరు సీనియర్ డైరెక్టర్ వివి వినాయక్.
లూసిఫర్ ను తెలుగు లో రీమేక్ చేయాలి అనే ఆలోచన వచ్చిన సమయంలో సాహో సినిమా విడుదల అవ్వడం.. ఆ సినిమా దర్శకుడు కచ్చితంగా లూసిఫర్ ను తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యేలా తీయగలడు అనే అభిప్రాయంను మెగా కాంపౌండ్ వ్యక్తం చేయడం జరిగింది... రీమేక్ స్క్రిప్ట్ బాధ్యతను కూడా సాహో దర్శకుడు సుజీత్ కి అప్పగించడం కూడా జరిగింది.
సుజీత్ దాదాపుగా ఆరు నెలల పాటు లూసీఫర్ తెలుగు రీమేక్ కోసం స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. పలు వర్షన్ లు రెడీ చేసినా కూడా సుజీత్ మెప్పించలేక పోయాడు. చిరంజీవి పదే పదే తిరష్కరించడంతో పాటు చివరకు సుజీత్ ను తప్పించారు. ఆ తర్వాత వినాయక్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన కూడా కాదని మోహన్ రాజా ను తీసుకు వచ్చారు.
గాడ్ ఫాదర్ సినిమా మోహన్ రాజా కాకుండా వినాయక్ లేదా సుజీత్ ల్లో ఎవరు చేసినా కూడా సక్సెస్ అయ్యేదని.. కనుక ఆ ఇద్దరు కూడా మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్నారనే వాదన ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.