Begin typing your search above and press return to search.
#RRR కు జక్కన్న కాకుండా మరో దర్శకుడు!!!
By: Tupaki Desk | 23 Feb 2020 1:04 PM GMTఎన్టీఆర్.. రామ్ చరణ్ లు హీరోలుగా ఆలియా భట్ ఇంకా ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం దర్శకుడు ఎవరు అంటే చిన్న పిల్లాడైనా రాజమౌళి అని చెప్తాడు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కోసం అంతగా ఎదురు చూస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ దర్శకుడు ఎవరు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు.. కాని ఎన్నో విషయాలు తెలిసిన గూగుల్ మాత్రం ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర దర్శకుడు ఎవరు అంటే తప్పు చెప్తోంది.
ఎందరి గురించో.. ఎన్నో సంస్థల గురించి.. సినిమాల గురించి నిజాలు చెప్పే విక్కీ పీడియాకు కూడా ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర దర్శకుడు ఎవరు అనే క్లారిటీ ఉన్నట్లుగా లేదు. గూగుల్ మరియు విక్కీ పీడియాలు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి దర్శకుడు రాజమౌళి మాత్రమే కాదు సంజయ్ పాటిల్ అని చెబుతున్నాయి. కావాలంటే మీరు గూగుల్ లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర దర్శకుడు ఎవరు అంటూ ఇంగ్లీష్ లో టైప్ చేసి చూడండి. మీకు ఇలాంటి రిజల్ట్ వస్తుంది.
ఎవరో కావాలని విక్కీ పీడియాలో ఇలాంటి తప్పుడు సమాచారం నమోదు చేయడంతో గూగుల్ వారు కనీసం వెరిఫై చేయకుండా ఆర్‌ఆర్‌ఆర్ అనగానే ఇలాంటి తప్పుడు పేరును చూపిస్తున్నారు. ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు లైట్ తీసుకుంటున్నారు. కాని జక్కన్న ఫ్యాన్స్ మాత్రం గూగుల్ పై అసహనం వ్యక్తం చేస్తు తప్పును గూగుల్ కంపెనీకి రిపోర్ట్ చేస్తున్నారు. మరి విక్కీ పీడియా మరియు గూగుల్ లు ఇప్పటికి అయినా తమ తప్పును సరిదిద్దుకుంటాయా చూడాలి.