Begin typing your search above and press return to search.
ఒకే కథతో రెండు సినిమాలు.. నిర్మాతలు కోర్టుకి!
By: Tupaki Desk | 11 Nov 2021 4:30 AM GMTటైగర్ నాగేశ్వరరావు బయోపిక్ - ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఇది. ఒకే వ్యక్తిపై రెండు బ్యానర్ల నుంచి బయోపిక్ ప్రకటనలు తీవ్ర వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. 1970 ప్రాంతంలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావుపై బయోపిక్ కోసం ఇద్దరు నిర్మాతలు పోటీపడుతుండడం పెనువివాదానికి కారణమవుతోంది. త్వరలోనే ఈ పంచాయితీ కోర్టు గుమ్మం వరకూ వెళ్లనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
డిసెంబర్ 2017లో దర్శకుడు వంశీ స్టువర్ట్ పురంలోని డేర్ డెవిల్ దొంగపై సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించాల్సి ఉండగా అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారని కథనాలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ ఆ తర్వాత క్యాన్సిలైంది.
కానీ ఇంతలోనే వరుస ప్రకటనలతో మొత్తం సీనే మారింది. ఆగస్ట్ 2021న నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకు హీరోగా స్టూవర్ట్ పురం దొంగ అనే చిత్రాన్ని ప్రకటించారు. కొత్త దర్శకుడు కెఎస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు జీవితంపై బయోపిక్ అని కథనాలొచ్చాయి. గత వారం నిర్మాత అభిషేక్ అగర్వాల్ వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని ప్రకటించగా వివాదం మొదలైంది.
ఇటీవల పరిశ్రమలో ఒకటే చర్చ. చాలామంది ఈ బయోపిక్ ను ఎవరు రూపొందిస్తున్నారు? అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పరిశ్రమలో కొద్దిరోజులుగా ఇవే గుసగుసలు. అయితే ఈ సినిమా స్క్రిప్టుపై తాను గత నాలుగేళ్లుగా పని చేస్తున్నానని దర్శకుడు వంశీ చెబుతున్నారట. నాలుగేళ్ల క్రితమే స్క్రిప్ట్ ని సాయిశ్రీనివాస్ కి చెప్పానని ఆయన అంటున్నారనేది ఒక నివేదిక. చాలా కాలం వేచి చూసి అతడు ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారట. ``నేను కథను రాయడం కోసం టైగర్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను కూడా కలిశాను. బయోపిక్ కి దర్శకత్వం వహించడానికి అతని కుటుంబ సభ్యుల నుండి అన్ని అనుమతులు చట్టపరమైన హక్కులు NOC లు పొందాను`` అని వంశీ చెబుతున్నారు. తన కథతో ఇతరుల కథ పోలికలు కలిగి ఉంటే దానికోసం పోరాడతాను అని వంశీ అంటున్నారు. అయితే ప్రజలకు ముందే తెలిసిన కథతో బయోపిక్ తీయడానికి తనకు ఎలాంటి హక్కులు అవసరం లేదని నిర్మాత బెల్లంకొండ సురేష్ చెప్పడం మరో ట్విస్టు. ``నాకు హక్కులు ఎందుకు కావాలి? గాంధీజీపై ఎవరైనా సినిమా తీయవచ్చు కదా? కాబట్టి చట్టబద్ధత .. హక్కుల ప్రశ్న ఎక్కడ ఉంది? టైగర్ నాగేశ్వరరావు జీవితం గురించి అందరికీ తెలుసు. అతని ప్రొఫైల్ పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఎవరైనా సినిమా తీయవచ్చు`` అని బెల్లంకొండ సురేష్ అనడం ఆసక్తికరం.
కానీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ వాదన భిన్నంగా ఉంది. హత్యకు గురైన స్టూవర్డ్ పురం దొంగపై బయోపిక్ తీయడానికి తమకు అన్ని చట్టపరమైన హక్కులు ఉన్నాయని వాదిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు ప్రొఫైల్ పబ్లిక్ గా ఉండవచ్చు. కానీ కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నాయి., అవి అతని కుటుంబానికి మాత్రమే తెలుసు. అతని కుటుంబం అతని గురించిన అన్ని చక్కటి విషయాలు లోతైన వివరాలను మాతో మాత్రమే పంచుకుంది``అని అభిషేక్ చెబుతున్నారు. మొత్తానికి పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. ఈ వివాదానికి పరిష్కారం ఏ రూపంలో ఉంటుందన్నది వేచి చూడాల్సి ఉంది. అంతిమంగా ఎవరి వాదన నెగ్గుతుందో చూడాలి