Begin typing your search above and press return to search.
జక్కన్నకు ఇద్దరు ఆర్జీవీకి ఇద్దరు!
By: Tupaki Desk | 31 March 2022 4:33 AM GMTటైమ్ చూసి టైమ్ బాంబ్ పేల్చడంలో ఆర్జీవీ తర్వాతే. ఆయన కామిక్ సెన్స్.. కామెడీ టైమింగ్ గురించి బయటి ప్రపంచానికి తెలియనిది కాదు. ఇదిగో ఇప్పుడు మళ్లీ అలాంటి టైమింగ్ ని చూపించాడు ఆర్జీవీ. "రాజమౌళీ నీకు డేంజరస్ మెన్ ఉంటే.. నాకు డేంజరస్ ఉమెన్ ఉన్నారు!" అంటూ ఓ ఫోటోని షేర్ చేసాడు.
ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. నిజమే ఆయనకు ఇద్దరు.. నీకు ఇద్దరు! అంటూ జోరుగా కామెంట్లు గుప్పిస్తున్నారు. ఈ ఫోటోని వాట్సాపుల్లో వైరల్ గా షేర్ చేస్తున్నారు. షేరింగ్ ఏది అయినా కానీ ఆర్జీవీ కి సోషల్ మీడియాల్లో అసాధారణంగా ఫాలోయింగ్ పెరుగుతోంది.
మా తమ్ముడిని అర్థం చేసుకోరేమి?
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యవహార శైలిని చాలా మంది తప్పు పడుతుంటారు. సమాజంపై ఆయన రివర్స్ సైకాలజీ అప్లికేషన్ ని అర్థం చేసుకునేది తక్కువ మందే. ఎవరి సౌకర్యం కోసం వారు నచ్చినట్టు మాట్లాడతారు.
కానీ ఆయనను అర్థం చేసుకున్నది మాత్రం రక్త సంబంధం మాత్రమే. ఆర్జీవీ సోదరి విజయ చాలా వేదికలపై తన సోదరుడిని సమర్థించారు. తన సోదరుడి గురించి కొన్ని విషయాలను ఇటీవల మీడియాకు షేర్ చేశారు.
ఆమె RGV అంటే చాలా ఎత్తున ఉన్న గొప్పవాడని ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆ ఇంట్లో ఆర్జీవీ ఉండటమే వేరు. ఆర్జీవీని కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటారని,.. వేళ్లపై లెక్కపెట్టేంత మంది ఉన్నారని విజయ అన్నారు.
ఆమె 9 సంవత్సరాల వయస్సులో RGV దర్శకత్వ నైపుణ్యాల గురించి అతడి చిన్ననాటి జ్ఞాపకాలను కూడా సోదరి విజయ పంచుకున్నారు. తాము సింగిల్ లైన్ లో మాట్లాడతామని.. తమ ఇంట్లో ఎక్కువసేపు చర్చలు జరగవని ఆమె స్పష్టం చేశారు. ప్రతిదీ ప్రాక్టికల్ గానే ఉంటుందని కూడా వెల్లడించారు. ఇంప్రాక్టికల్ వరల్డ్ కి ఇది అర్థం కావడం కష్టమేనన్నది ఆవిడ ఉద్ధేశం కావొచ్చు.