Begin typing your search above and press return to search.

చిరు పక్కన ఇద్దరు భామలు ఎవరో ?

By:  Tupaki Desk   |   29 May 2019 8:43 AM GMT
చిరు పక్కన ఇద్దరు భామలు ఎవరో ?
X
ప్రస్తుతం సైరా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కోసం సిద్ధమవుతారు. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ భాగస్వాములుగా ఉండే ఈ ప్రాజెక్ట్ లో హీరొయిన్ల గురించిన సమాచారం లేక అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముందు తమన్నా పేరు వినిపించింది. ఆ తర్వాత శృతి హాసన్ అన్నారు. మిల్కీ బ్యూటీ ఇప్పటికే సైరా చేసింది కాబట్టి తను నో చెప్పడానికి అవకాశాలు తక్కువ.

ఎలాగూ సీనియర్ హీరోల సరసన వరసగా చేస్తుండటంతో తనకేమి ఇబ్బంది లేదు. ఇక శృతి హాసన్ చాలా గ్యాప్ తర్వాత సినిమాలు సైన్ చేస్తోంది. విజయ్ సేతుపతిది మాత్రమే ఇప్పటిదాకా ఒప్పుకుంది. నాన్న కమల్ సమకాలీకుడు అయిన చిరుతో చేస్తుందా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నా ఆల్రెడీ ఆయన తమ్ముడు పవన్ తో బ్లాక్ బస్టర్ ఉంది కాబట్టి ఇదేమంత ఇష్యూ కాదనే మాట కూడా వినిపిస్తోంది

ఇది ఒక పక్క అయితే స్వీటీ అనుష్కను నటింపజేసేందుకు చరణ్ ట్రై చేస్తున్నాడన్న టాక్ కూడా ఉంది. గతంలో అనుష్క చిరుతో కలిసి స్టాలిన్ లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటున్న స్వీటీ చేతిలో ప్రస్తుతం మల్టీ లాంగ్వేజ్ మూవీ నిశబ్దం మాత్రమే ఉంది. తన వెర్షన్ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఆప్షన్స్ చాలదన్నట్టు జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాద్ పేరు కూడా తెరమీదకు వచ్చింది.

పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు బాగా సూటయ్యే శ్రద్ధా చిరు లాంటి సీనియర్ హీరో సరసన చేస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం. మొత్తానికి ఇన్నేసి ఆప్షన్స్ చూస్తుంటే ఫైనల్ గా మెగాస్టార్ పక్కన జోడి కట్టే ఇద్దరు భామలు ఎవరో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితమైన సమాధానం కావాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. జూలైలో ఇది ప్రారంభించేందుకు ప్లానింగ్ లో ఉంది ప్రొడక్షన్ టీం