Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు హీరోయిన్ల‌తో నాగ్‌

By:  Tupaki Desk   |   27 Nov 2016 7:14 AM GMT
ఇద్ద‌రు హీరోయిన్ల‌తో నాగ్‌
X
ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాజు గారి గ‌ది` సీక్వెల్ చేయ‌బోతున్నాడు నాగార్జున‌. ఈరోజే ఆ సినిమా ప్రారంభ‌మైంది. రాజుగారి గ‌ది ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్‌ గా తెర‌కెక్కింది. దాన్నిబ‌ట్టి సీక్వెల్ కూడా అదే స్టైల్ క‌థే అని అర్థం చేసుకోవ‌చ్చు. అయితే నాగ్‌ కి మాత్రం ఆ జోన‌ర్ కొత్త‌దే. ఇదివ‌ర‌కెప్పుడూ ఆయ‌న తెర‌పై భ‌య‌పెట్టింది లేదు. తొలిసారి ఆ ప్ర‌య‌త్నం చేస్తుండ‌డంతో అంద‌రి దృష్టీ ఆ సినిమాపై ప‌డింది. మామూలుగా హార‌ర్ థ్రిల్ల‌ర్‌ ల‌లో హీరోయిన్ల‌కి పెద్ద‌గా స్కోప్ ఉండ‌దు. అది కూడా స్టార్ క‌థానాయ‌కులు న‌టిస్తున్నారంటే హీరోయిన్ల పాత్ర నామ‌మాత్ర‌మైపోతుంటుంది. హీరోయిన్‌ ని కేవ‌లం గ్లామ‌ర్ పార్ట్‌కి మాత్రం ఉప‌యోగిస్తుంటారు.

అయితే నాగార్జున న‌టిస్తున్న `రాజుగారి గ‌ది2`లో మాత్రం ఆ గ్లామ‌ర్ పాళ్లు మ‌రికాసిన్ని ఎక్కువే ఉన్నాయ‌నిపిస్తోంది. అందుకే సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లకి చోటు క‌ల్పించాడు ఓంకార్‌. నాగ్ సినిమాల‌కి హీరోయిన్లు ప్ర‌ధాన‌బ‌లం. నాగ్ ప‌క్క‌న ఎంత ఎక్కువ‌మంది హీరోయిన్లు ఉంటే తెర‌పై అంత సంద‌డి క‌నిపిస్తుంటుంది. సోగ్గాడే చిన్నినాయ‌నాలాంటి సినిమాలే అందుకు ఉదాహ‌ర‌ణ‌. ఆ విష‌యాన్ని ప‌సిగ‌ట్టే ఓంకార్ ఇద్ద‌రు హీరోయిన్ల‌ని సెట్ చేశాడు సినిమాలో. ఇక తెర‌పై రొమాన్సే రొమాన్స్ అన్న‌మాట‌. రాజుగారి గ‌ది 2 సినిమాని పీవీపీ సంస్థ నిర్మిస్తుండ‌గా - త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. అబ్బూరి ర‌వి మాట‌లు రాస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/