Begin typing your search above and press return to search.

ఇద్ద‌రు హీరోయిన్లున్నా... ఒక్క పాట ఉండ‌ద‌ట‌

By:  Tupaki Desk   |   28 Feb 2018 7:19 AM GMT
ఇద్ద‌రు హీరోయిన్లున్నా... ఒక్క పాట ఉండ‌ద‌ట‌
X
టాలీవుడ్‌లో హీరోయిన్లంటే..గ్లామ‌ర్ డాల్స్‌. పాట‌ల‌కు, రొమాంటిక్ సీన్ల‌కు త‌ప్ప క‌థ‌లో వారి పాత్ర త‌క్కువే. అలాంటిది మెగా హీరో చేయ‌బోయే ఓ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌ను పెట్టాల‌నుకుంటోంది చిత్ర‌యూనిట్‌. అయినా ఒక్క పాట కూడా ఉండ‌ద‌ట‌. ఆ సినిమా ఇంకేదో కాదు... వ‌రుణ్ తేజ్ న‌టించ‌బోయే స్పేస్ సినిమా. మ‌రి వ‌రుణ్ ఒప్పుకున్నాడా?

ఘాజీ సినిమాతో మంచి ద‌ర్శ‌కుడిగా పేరుతెచ్చుకున్నాడు సంక‌ల్ప్ రెడ్డి. ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ సినిమా చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఇప్ప‌టికే క‌థ వ‌రుణ్‌కు న‌చ్చ‌డం ఓకే చెప్పేయ‌డం ఎప్పుడో జ‌రిగిపోయింది. షూటింగ్ ప్రారంభించ‌డ‌మే మిగిలింది. ఇందులో వరుణ్ ఆస్ట్రోనాట్‌గా క‌నిపించ‌బోతున్నాడు. జీరోగ్రావిటీలో తేలియాడేట్టుగా న‌టించేందుకు... నెల రోజుల పాటూ శిక్ష‌ణ తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఆ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌ను కూడా పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడు సంక‌ల్ప్ రెడ్డి. ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నారంటే పాట‌లు, ప్రేమ‌లు, రొమాన్స్ అదిరిపోతుంది అనుకుంటారు సినీజ‌నాలు. కానీ అవేవీ ఈ సినిమాలో క‌నిపించ‌న‌ట్టే తెలుస్తోంది.

ఇద్ద‌రు హీరోయిన్లున్నా వారితో డ్రీమ్ సాంగ్స్ లాంటివి ప్లాన్ చేయ‌డం లేదు సంక‌ల్ప్‌రెడ్డి. దానికి వ‌రుణ్ తేజ్ కూడా ఒప్పుకున్నాడు. మ‌ధ్య‌లో ఇలాంటి పాట‌లు పెడితే... స్టోరీ ఫ్లో దెబ్బ‌తింటుంద‌ని అనుకుంటున్నాడు ద‌ర్శ‌కుడు. క‌థ న‌చ్చ‌డంతో ... మెగా హీరో.. నిర్మాత‌లు ఎలాంటి కొర్రీలు పెట్ట‌డం లేద‌ని తెలుస్తోంది. వ‌రుణ్ తేజ్ ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్యా ఉన్నా కానీ... పాట‌లు లేని సినిమా చేయ‌బోతున్నాడు.