Begin typing your search above and press return to search.

బాలయ్య అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ 3.. గెస్ట్‌ లు వీళ్లే

By:  Tupaki Desk   |   30 Oct 2022 10:59 AM GMT
బాలయ్య అన్‌ స్టాపబుల్‌ ఎపిసోడ్‌ 3.. గెస్ట్‌ లు వీళ్లే
X
నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఓటీటీ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్‌ స్టాపబుల్‌ సీజన్‌ 2 ఎపిసోడ్‌ 3 గెస్ట్‌ లు ఎవరో క్లారిటీ వచ్చేసింది. సీజన్‌ 2 లో మొదటి ఎపిసోడ్‌ లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు పాల్గొన్నారు.

రెండవ ఎపిసోడ్‌ లో డీజే టిల్లు ఫేమ్‌ సిద్దు జొన్నలగడ్డ మరియు ఫలక్ నుమా దాస్ ఫేమ్‌ విశ్వక్ సేన్ లు పాల్గొన్న విషయం తెల్సిందే. మొదటి రెండు ఎపిసోడ్స్ కి మంచి స్పందన వచ్చింది. మూడవ ఎపిసోడ్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో గత శుక్రవారం మళ్లీ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్‌ నే సెన్సార్ లేకుండా స్ట్రీమింగ్‌ చేయడం జరిగింది.

మూడవ వారం కొత్త ఎపిసోడ్‌ లేకపోవడం వల్ల బాలయ్య అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వారం ఎపిసోడ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో గెస్ట్‌ లు ఎవరు అనే విషయమై క్లారిటీ వచ్చింది.

రెండవ ఎపిసోడ్‌ లో ఎలా అయితే ఇద్దరు యంగ్‌ హీరోలు సందడి చేశారో.. మూడవ ఎపిసోడ్‌ లో కూడా ఇద్దరు యంగ్‌ హీరోలు సందడి చేయబోతున్నారు. యంగ్‌ హీరోలు శర్వానంద్‌ మరియు అడవి శేష్ లు మూడవ ఎపిసోడ్‌ లో రచ్చ చేయబోతున్నారు.

ఈ ఇద్దరు హీరోలు కూడా డౌన్ టు ఎర్త్‌ అంటూ పేరు దక్కించుకున్నారు. కనుక వీరి నుండి కూడా పలు ఆసక్తికర విషయాలను బాలయ్య రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య అన్‌ స్టాపబుల్‌ లో ఈసారి పవన్ మరియు త్రివిక్రమ్‌ హాజరు అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్‌ షో కి టాప్‌ షో గా రేటింగ్‌ దక్కింది. ఈసారి కూడా తప్పకుండా టాప్‌ షో గా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సీజన్‌ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. వచ్చే వారం ఒక సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ మరియు యంగ్‌ హీరోయిన్‌ ఎపిసోడ్‌ లో సందడి చేసే అవకాశం ఉంది అంటున్నారు.