Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ 5 : సన్నీ గెలుపుకు రెండు కారణాలు
By: Tupaki Desk | 20 Dec 2021 4:23 AM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతున్నట్లుగా.. చాలా మంది అనుకుంటున్నట్లుగా సన్నీ విజేతగా నిలిచాడు. విన్నర్ గా సన్నీ గెలువగా... రన్నర్ గా షన్నూ నిలిచాడు. మూడవ స్థానంలో సింగర్ శ్రీరామ చంద్ర నిలిచాడు. ఇక నాల్గవ స్థానం లో మానస్ అయిదవ స్థానంలో సిరిలు నిలిచారు.
బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచినందుకు గాను సన్నీకి 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ తో పాటు సువర్ణ భూమిలో 25 లక్షల విలువ చేసే ప్లాట్ మరియు లక్షన్నర విలువ చేసే బైక్ అన్నింటికంటే ముఖ్యమైన బిగ్ బాస్ సీజన్ 5 ట్రోఫీ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన సన్నీ తన ఆనందంను స్టేజ్ పై చూపించాడు. ప్రతి ఎమోషన్ ను ఎప్పటికప్పుడు బహిర్గతం చేసే సన్ని విజేత అంటూ ప్రకటించిన వెంటనే నాగార్జునను ఎత్తుకోవడం.. ముద్దు పెట్టుకోవడం చేశాడు. ఆ సమయంలో షన్నూ కాస్త ఇబ్బందిగా అనిపించాడు.
మొత్తంగా సన్నీ విన్నర్ అవ్వడంతో ఆయన అభిమానుల ఉత్సాహం మరింత పెరిగినట్లయ్యింది. విన్నర్ అయిన సన్నీకి ఘన స్వాగతం పలికారు. పదుల సంఖ్యలో కార్లతో సన్నీకి ఆహ్వానం పలికేందుకు గాను ర్యాలీ తీయడం జరిగింది. బిగ్ బాస్ విన్నర్ సన్నీ ప్రేక్షకుల ఓట్లు మాత్రమే కాకుండా మనసులు కూడా గెలుచుకున్నాడు.
ఖచ్చితంగా సన్నీ లోనికి వెళ్లే సమయంలో విజేత అవుతాడు అని ఏ ఒక్కరు అనుకోలేదు. అతడు మాత్రం ట్రోఫీ దక్కించుకోవాలని బలమైన సంకల్పంతో వెళ్లాడు. ప్రతి ఒక్కరు అదే సంకల్పంతో వెళ్తారు. కాని అందుకోసం అతడు పడ్డ కష్టం చాలా ఉందని చెప్పాలి.
బిగ్ బాస్ లో కష్టపడటం కాకుండా ప్రతి ఒక్క కంటెస్టెంట్ ను కూడా గెలుచుకోవాలి... ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలి. అప్పుడే విజేతగా నిలుస్తారు. సన్నీ ఈ విజయానికి ప్రథానంగా రెండు కారణాలను చెప్పుకోవచ్చు.
సన్నీ విజయంలో కీలక పాత్ర పోషించింది ఆయన మనస్థత్వం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బాస్ లో ఉన్నాను అని కాకుండా తాను బయట ఎలా ఉన్నానో ఇక్కడ అలాగే అన్నట్లుగా సన్నీ ఆట ఆడాడు.. ఎమోషన్స్ ను చూపించాడు. ముందు ఒకటి వెనుక ఒకటి మాట్లాడే తత్వం అస్సలు కాదు.
చిన్న పిల్లాడి మనస్థత్వం అంటూ అతడి ఆటను అభిమానులు ఆస్వాదించారు. మన పక్కింటి కుర్రాడు.. మనలో ఒకడు అన్నట్లుగా అతడి తీరు కనిపించింది. ప్రతి ఒక్కరిని స్నేహంతో దగ్గరికి చేసుకోవడం.. తనను ఇష్టపడని వారిని కూడా ప్రేమించడం వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేరింగ్ చూపించడం అతడికే సాధ్యం అయ్యింది. అందుకే అతడిని విజేతగా చేస్తే తాము విజేతలం అయినట్లుగా అభిమానులు ప్రేక్షకులు భావించారు.
సన్నీకి ఈ విజయం దక్కడానికి మరో ప్రథాన కారణం షన్ను మరియు సిరిల మద్య ఉన్న అర్థం కాని.. అర్థ రహిత వ్యవహార సంబంధం. వారిద్దరు మంచి స్నేహితులు అని మొదట్లో అనుకున్న వారే.. ఇదే స్నేహంరా బాబు అనుకున్నారు. ప్రేక్షకులకు విసుగు తెప్పించారు. ఇద్దరు కూడా స్నేహితులేనా వీళ్లు అనే అనుమానాలు కలిగేలా ప్రవర్తించారు. ముద్దులు.. హగ్గులు మాత్రమే కాకుండా ఒకరిపై ఒకరు అజమాయిషీ చేసుకుంటూ అలుగుతూ గులుగుతూ చిరాకు పెట్టారు.
ఈ వ్యవహారం కనుక జరుగకుండా ఉంటే ఖచ్చితంగా షన్ను విజేత అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ ఉండేవి. షన్నూ కు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిల్లో మరియు కుర్రాళ్లలో అతడి ఫాలోయింగ్ ఉన్నా కూడా ఫ్యామిలీ జనాలు మాత్రం సన్నీ వెనుక నిలిచారు.
షన్నూ సిరిల ప్రవర్తన ఫ్యామిలీ ఆడియన్స్ కు ఏమాత్రం నచ్చలేదు. ఆ కారణం వల్ల కూడా సన్నీ విజేతగా నిలిచాడు. మొత్తానికి సన్నీ విజేతగా నిలిచి వెళ్లేప్పుడు ఉన్న పాపులారిటీ ముఖ్యం కాదు.. అక్కడకు వెళ్లిన తర్వాత ఉండే విధానం ముఖ్యం అన్నట్లుగా నిరూపించాడు. ఇక ముందు సన్నీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.