Begin typing your search above and press return to search.
'పేట' కు రెండు థియేటర్లేనా?
By: Tupaki Desk | 9 Jan 2019 4:13 AM GMTసంక్రాంతి బరిలో రజనీ `పేట` చిత్రాన్ని థియేటర్లు ఇవ్వకుండా నలిపేస్తున్నారా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. గత కొద్ది రోజులుగా తన సినిమాకి థియేటర్లు ఇవ్వలేదని లైవ్ వేదికలపై వార్ నడిపిస్తున్న అశోక్ వల్లభనేనిపై `థియేటర్ మాఫియా` పంచ్ రెండో రోజు నుంచే పడనుంది. మాఫియా కుక్కల్ని తరిమేయాలి! ఏదో ఒకరోజు చెప్పులతో కొట్టడం ఖాయం! అంటూ భారీ పంచ్ లు వేసిన వల్లభనేనికి ఆ మేరకు థియేటర్ యజమానులు బిగ్ పంచ్ వేయడంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. నాలుగు సినిమాల నడుమ ఈ సన్నివేశం తప్పడం లేదని థియేటర్ యజమానులు చెబుతున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా `పేట` తొలి రోజు(జనవరి 10న) భారీగానే థియేటర్లను దక్కించుకున్నా - రెండో రోజు నుంచే బిగ్ పంచ్ పడనుంది. జనవరి 11న - వినయ విధేయ రామ - జనవరి 12న - ఎఫ్ 2 చిత్రాలు అత్యంత భారీగా రిలీజవుతుండడంతో జనవరి 10న రిలీజవుతున్న `పేట` చిత్రాన్ని రెండో రోజు నుంచి మెజారిటీ పార్ట్ థియేటర్ల నుంచి తొలగించనున్నారు. ముఖ్యంగా మెట్రో నగరం హైదరాబాద్ లో వందలాది థియేటర్లు - స్క్రీన్లు ఉంటే అన్నిటినుంచి ఈ సినిమాని తొలగించనున్నారట. అంటే జనవరి 11 నుంచి పేట చిత్రం కేవలం రెండు థియేటర్లు మినహా హైదరాబాద్ లో ఎక్కడా ఆడదు. కనిపించదు..
హైదరాబాద్ లో వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలకు చాలా ముందే థియేటర్లను కేటాయించారు. ఈ రెండు సినిమాల్ని అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు ముందస్తు ప్లాన్ సాగింది. అందువల్ల హైదరాబాద్ లో పేట చిత్రానికి ఛాన్సే లేదని తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ - సప్తగిరి థియేటర్ - మల్కాజిగిరి- రాఘవేంద్ర థియటర్ లను `పేట`కు కేటాయించారు. ఇక మల్టీప్లెక్సుల్లో అసలు ఈ సినిమాకి స్కోప్ అన్నదే లేకపోవడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. కూకట్ పల్లి - దిల్ షుక్‌నగర్ లాంటి చోట్ల ఎన్నో సింగిల్ థియేటర్లు - మల్టీప్లెక్సులు ఉన్నా ఎక్కడా అసలు పేట చిత్రానికి థియేటర్ అన్నదే కేటాయించకపోవడం చూస్తుంటే ఏ రేంజులో పంచ్ పడిందో అర్థమవుతోంది. స్ట్రెయిట్ చిత్రాలకు చాలా ముందే థియేటర్ రిలీజ్ ప్లాన్ చేయడంతో ఈ పంచ్ తప్పలేదని చెబుతున్నారు.